twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో మరో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్

    By Srikanya
    |

    వెంకటేష్, మహేష్ కాంబినేషన్ లో రూపొందనున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మాధురీ దీక్షిత్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె వెంకటేష్ సరసన చేయనుందని చెప్తున్నారు. మహేష్ వదినగా ఆమె కనపడనుంది. ఇక మహేష్ సరసన సమంతనే ఎంపిక చేసారు. ఇక వెంకటేష్ పాత్ర సినిమాలో కేవలం ఇరవై తొమ్మిది నిముషాల మాత్రమే అని చెప్తున్నారు.అలాగే మహేష్,వెంకటేష్ అన్నదమ్ములగా కనిపించనున్నారని,ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర కు ఎంపిక చేసారు. ఇక వ్రకాష్ రాజు చేసే పాత్ర తండ్రి పాత్ర అని తెలుస్తోంది.పరుగులో చేసిన పాత్రనే ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో చేయనున్నారు. ఇక ఈ చిత్రం గురించి దిల్‌రాజు మాట్లాడుతూ ''25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్‌ ఇది. వెంకీ, మహేష్‌ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు.

    సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం. టైటిల్‌ మంచి ఫీల్‌నిచ్చింది. రెగ్యులర్‌ చిత్రీకరణ నవంబర్‌ ప్రారంభిస్తాం. మే నెలాఖరుకి సినిమా పూర్తిచేసి..అదే నెలలో విడుదల చేస్తాం అన్నారు. దసరా రోజు పూజ చేసి లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ లో వెంకటేష్,ప్రకాష్ రాజ్ ఇద్దరూ నవంబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటారు. మహేష్ మాత్రం జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళతారు. ఇక ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ ఇద్దరూ అన్నదమ్ములుగా కనిపించనున్నారని చెప్పుకున్నారు. ప్రస్తుతం మహేష్ దూకుడు విజయోత్సాహంలో ఉన్నారు. పూరీ తో చేస్తున్న ది బిజినెస్ మ్యాన్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వెంకటేష్ విషయానికి వస్తే ఆయన గంగ..ది బాడీగార్డ్ చిత్రం విడుదల కోసం చూస్తున్నారు. మళయాళ చిత్రం ది బాడీ గార్డ్ కి రీమేక్ వెర్షన్ ఇది. డాన్ శీను డైరక్టర్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఇక నిర్మాత దిల్ రాజు..తన తాజా చిత్రం ఓ మై ప్రెండ్ ఫినిషింగ్ టచెస్ లో ఉన్నారు. సిద్దార్ధ,హన్సిక,శృతిహాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది. సహనిర్మాతలు: శిరీష్‌- లక్ష్మణ్‌, కథ- కథనం-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

    English summary
    In seethamma vakitlo sirimalle chettu movie venkatesh's role will be 29mins and Madhuri dixit is the wife of venky. Venkatesh and Mahesh babu to do as brothers Madhuri Dixit will me mahesh babu's sister in law and Samantha is the leading of female role.The film will bw a family Drama.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X