'సీతమ్మ వాకిట్లో ..'లో లీకైన మహేష్ డైలాగు

By Srikanya

మహేష్,వెంకటేష్ కాంబినేషన్ లో అడ్డాల శ్రీకాంత్ రూపొందిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో డైలాగులుకు అత్యంత ప్రాధాన్యత ఉందని సమాచారం. ఈ చిత్రంలో మహేష్ చెప్పిన డైలాగు అంటూ నెట్ లో ఒకటి పాపులర్ అవుతోంది. ఆ డైలాగు ఏమిటంటే...

“నీ దగ్గర ఏమన్నా ఎగస్ట్రా కరిక్యులర్ ఏక్టివిటిస్ ఉంటే నీ రెస్యూమ్ లో పెట్టుకో.. నా దగ్గర చూపెట్టకు...……"

ఈ డైలాగుకు మహేష్ అభిమానులు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్న ఈ చిత్రం షూటింగ్ సినిమాక్స్ లో జరిగింది. మహేష్,అతని ప్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రీకరించారు.ఇక ఈ చిత్రంలో సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారని దిల్ రాజు అన్నారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో మహేష్‌బాబు, సమంత తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: గుహన్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X