మెగా హీరోలపై ఫోకస్ పెట్టిన సీటిమార్ దర్శకుడు.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే?

సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉన్నా కూడా ఫైనల్ గా సక్సెస్ అందుకున్న వారికి అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే దర్శకులకు బాక్సాఫీస్ వద్ద భారీ డిమాండ్ ఉండాల్సిందే. స్టార్ హీరోలను కమర్షియల్ సినిమాలతో డీల్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎంత క్రియేటివ్ డైరెక్టర్ అయినా సరే కొన్నిసార్లు అభిమానులకు అభిరుచికి తగిన విధంగా తన మేకింగ్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఆ విషయంలో దర్శకులపై కొంత ఒత్తిడి పెంచుతూ ఉంటారనే చెప్పాలి. ఆ విధంగా అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేయగలిగితేనే సినిమా చేసే అవకాశం దొరుకుతుంది. ఇక మాస్ సినిమాల దర్శకుడు సంపత్ నంది కి మరోసారి మెగా కాంపౌండ్ లోనే ఛాన్స్ దొరికే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది

ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పతిచయమైన సంపత్ నంది ఆ తర్వాత రెండో అవకాశంలోనే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. రచ్చ సినిమా ఫుల్ కమర్షియల్ మాస్ సినిమాగా తెరకెక్కించి బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు అందుకున్నాడు. ఇక ఆ సినిమా అనంతరం సంపత్ నందికి మిగతా స్టార్ హీరోల నుంచి కూడా ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ అతను మాత్రం కొంచెం కూడా టెంప్ట్ అవ్వకుండా తన వద్ద ఉన్న కథలకు సెట్టయ్యే హీరోలను మాత్రమే సంప్రదించాడు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒకసారి సినిమా చేసే అవకాశం వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ను మొదట సంపత్ నందితో చేయాల్సిందే. కానీ స్క్రిప్ట్ డిజైన్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా సంతృప్తి కాకపోవడంతో ఆ ఛాన్స్ బాబీ కి దక్కింది.

 Seetimaarr director sampath nandhi focusing on megastar chiranjeevi,

బెంగాల్ టైగర్ సినిమాతో కూడా అంతగా అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయిన సంపత్ నదికి ఆ తర్వాత చేసిన గౌతమ్ నంద సినిమా కూడా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ గోపిచంద్ తోనే సీటిమార్ అనే యాక్షన్ సినిమాను తెరకెక్కించే బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇటీవల అతనికి మెగాస్టార్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి. ట్రైలర్ చూసి కూడా మెగాస్టార్ సంపత్ నందిని మెచ్చుకున్నారు. అయితే సంపత్ నంది ఇదే ఎనర్జీలో ఉండగానే మెగాస్టార్ కు కథలు చెప్పాలని అనుకుంటున్నాడట. మెగాస్టార్ కూడా యువ మాస్ దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

సంపత్ కూడా అవకాశం వస్తే ఎప్పుడైనా సరే చేయాలని ఆలోచిస్తున్నాడు. సిటిమార్ సినిమా పై కూడా మెగాస్టార్ పాజిటివ్ కామెంట్ చేయడంతో త్వరలోనే కథను కూడా చెప్పాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక లూసిఫర్ రీమేక్ సినిమా అయిపోయిన అనంతరం మరో రెండు సినిమాలను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని ఆలోచిస్తున్నారట. మారుతి సినిమాతో పాటు సంపత్ నంది కూడా అందులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ చాన్స్ ను సంపత్ నంది ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X