"సీజ్ ది షిప్".. పవర్‌ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేసేసిన బడా నిర్మాత అతనేనా??
రీసెంట్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అయ్యిన డైలాగ్ ఏదన్నా ఉంది అంటే.. అది డెఫినెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన డైలాగ్ "సీజ్ ది షిప్" అని చెప్పాలి. పవన్ సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తన నోటి వెంట వచ్చిన ఈ మాట మాత్రం తమకి 100 కేజీయఫ్ లు , ఎన్నో ఓజి లు వచ్చినా ఈ రేంజ్ కిక్ ఇవ్వవు అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కష్ చేసుకుంటున్నారు.
కాగా ఈ ఒక్క మాట తోనే మళ్ళీ నేషనల్ మీడియాఎక్కేసారు పవన్ కళ్యాణ్. ఇలా ట్రెండ్ అయ్యిన పవన్ కళ్యాణ్ పలికించిన మాట మరో లెవెల్లోకి వెళ్లినట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఆయన చెప్పిన ఈ పవర్ఫుల్ డైలాగ్‌ని ఏకంగా ఓ బడా నిర్మాత ఇపుడు సినిమా టైటిల్ గా రిజిస్టర్ కూడా చేసేసినట్టు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి ఆ నిర్మాత ఎవరు ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. కానీ చాలా మందికి మాత్రం ఓ నిర్మాత పేరు టక్కున వెలుగుతుంది. మరి ఆ నిర్మాత ఎవరో కాదు పవన్ కళ్యాణ్‌కి పెద్ద భుక్తుడు బండ్ల గణేష్ అట. పవన్ కి బండ్ల గణేష్ ఎంత పెద్ద అభిమాని అనేది అందరికీ తెలుసు. పవన్ పై ఎన్నో సార్లు ప్రేమని తాను కనబరిచారు. అప్పట్లోనే పవన్ పై "దేవర" అనే పవర్ఫుల్ టైటిల్ ని బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించిన దాఖలాలు కూడా ఉన్నాయి.
దీనితో తానే మళ్ళీ తన అభిమాన హీరో, తన ఆరాధ్య దైవం కోసం ఈ పవర్ఫుల్ టైటిల్ ని కూడా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ పవన్ తో ఎప్పుడో ఓ సినిమాని బండ్ల గణేష్ ఓకే చేయించుకున్నాడు . కానీ ఎందుకో మళ్ళీ వీరి కలయికలో సినిమా అయితే పడలేదు. ఇపుడు ఈ సినిమా ఎప్పుడు మొదలువుతుందో ఏమో కానీ ప్రస్తుతానికి మాత్రం వాతావరణం సైలెంట్ గానే ఉందని చెప్పాలి.

ఆల్రెడీ పవన్ తో బండ్ల గణేష్ "గబ్బర్ సింగ్" అనే సినిమా చేస్తే అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా హిట్ అయ్యి బండ్ల గణేష్ కి భారీ లాభాలు అందించింది. దీనితో మళ్ళీ ఎప్పుడు నుంచో పవన్‌తో సినిమా తీయాలని బండ్ల గణేష్ ట్రై చేస్తున్నాడు. కానీ వర్కవుట్ కావడం లేదు.
ఆల్రెడీ పవన్ కమిటై ఫినిష్ చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయ్యాక సురేందర్ రెడ్డితో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి అవన్నీ పూర్తయ్యాకే బండ్ల గణేష్ దగ్గరకి రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











