‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ను ట్రిమ్ చేస్తున్నారా?
సినిమా కథ విషయానికొస్తే...పక్కపక్కనే ఉండే రెండు కాలనీల చుట్టూ కథ తిరుగుతుంది. ఒకటేమో ధనవంతుల కాలనీ, మరొకటి మిడిల్ క్లాస్ వాళ్లు ఉండే కాలనీ. శ్రీను (అభిజిత్), నాగరాజ్ (సుధాకర్), అభి (కౌశిక్), సత్య (రష్మి), లక్ష్మి (జారా), పద్మావతి (షగుణ్)... వీరంతా మిడిల్ క్లాస్ కాలనీ యువతరం. చదువు, లక్ష్యం, ప్రేమ, ఆకర్షణ... ఇలా రకరకాల అనుభవాల్ని ఆస్వాదిస్తూ ఈ యువతరం జీవితాలు ఎంతో అందంగా సాగుతుంటాయి.
ఈ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల ఇచ్చిన మెసేజ్ ఏమిటంటే.....డబ్బున్నంత మాత్రాన లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉండదు. బంధాలు, అనుబంధాలు, ఒకరికి ఒకరు అండగా ఉండటం, ఆనందంగా గడిపే క్షణాలు.....ఉన్నప్పుడే జీవితం బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని చెప్పదలిచాడు.
ఈ చిత్రం ద్వారా అక్కినేని అమల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వగా, హీరోయిన్ శ్రియ సెక్సీ లుక్‌తో ఇందులో కనిపించింది. అదే విధంగా చాలా కాలంగా తెరమరుగైన హీరోయిన్ అంజలా జవేరి ఈచిత్రంలో గెస్ట్ పాత్రలో గ్లామర్ ఒలికించింది.ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: విజయ్ సి.కుమార్, ఆర్ట్: తోట తరణి, నిర్మాతలు: శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.


Click it and Unblock the Notifications












