చైతూ- శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. స్టోరీ లైన్ ఇదే!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైత్య, హిట్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్కినేని నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే అఫీషియల్ గా ప్రకటించబడిన ఈ సినిమా గురించి ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
ఈనెల 25 వ తేదీ నుంచి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని, అలాగే ఈ సినిమా కథాంశం డ్యాన్స్ బ్యాక్ డ్రాప్‌లో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. క్లాసిక్ డ్యాన్స్ ఎక్స్‌పర్ట్ సాయి పల్లవి పాత్ర చుట్టే ఈ కథ తిరుగుతుంటుందని సమాచారం. తొలిసారి నాగచైతన్య- సాయి పల్లవి జోడీ కడుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో మొదటగా చైతన్య, సాయిపల్లవిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

అత్యంత సాధారణంగా సాగే కథలో ఊహించని మలుపులు ఉండేలా చూసుకుంటూ ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేయటం శేఖర్ కమ్ముల స్టైల్. నాచురాలిటీకి పెద్ద పీట వేస్తూ ఆయన సినిమాలు తెరకెక్కుతాయి. అదే కోవలో నాగచైతన్య, సాయి పల్లవి జోడీని మరింత నాచురల్‌గా చూపించాలని శేఖర్ కమ్ముల ప్లాన్‌లో ఉందట. ఇటీవలే ఫిదా రూపంలో మెగా వారసుడితో జోడీ కట్టిన సాయి పల్లవి.. ఇప్పుడు అక్కినేని వారసుడితో జోడీ కడుతుండటం ఆసక్తికర అంశం. సునీల్ నారంగ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నాటికి ముగించి 2020లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











