శేఖర్ కమ్ముల నుండి మరో ‘ఫిదా’ రాబోతోందా?
శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా విషయంలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఫిదా తరహాలో శేఖర్ కమ్ముల మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది వచ్చిన సూపర్ సక్సెస్ సినిమాల లిస్టులో ఈ మూవీ నిలిచిపోయింది. 'ఫిదా' సినిమా వ్యవహారం ఇంతటితో అయిపోలేదని, శేఖర్ కమ్ముల నుండి మరో 'ఫిదా' రాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
'ఫిదా' మూవీ సక్సెస్‌తో జోరు మీద ఉన్న శేఖర్ కమ్ములకు..... అలాంటి సినిమా తీయాలని చాలా ఆఫర్లు వస్తున్నాయట. శేఖర్ కమ్ముల కూడా అలాంటి ఆలోచనే చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన స్క్రిప్టు వర్కు మీద మునిగిపోయారని, త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.

దానికి కొనసాగింపు కాదు..
శేఖర్ కమ్ముల దృష్టిలో సీక్వెల్ అంటే ఆ చిత్రానికి కొనసాగింపు అస్సలు కాదు. కాకపోతే ‘ఫిదా' సినిమా ఛాయలతో ఉండే మరో లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నారట. ఇది కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో ఉంటుందని సమాచారం.
Recommended Video


సిమిలార్ మూవీ?
శేఖర్ కమ్మల గతంలో ‘హ్యాపీ డేస్' తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ రెండు వేర్వేరు సినిమాలు అయినప్పటికీ పోలికలు ఒకేలా ఉంటాయి. ఇపుడు ‘ఫిదా' తర్వాత కూడా శేఖర్ కమ్ముల అలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా చేయబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి

వర్కౌట్ అవుతుందా?
శేఖర్ కమ్ముల కెరీర్లో ‘హ్యాపీడేస్' పెద్ద హిట్. కానీ అలాంటి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. మరి ‘ఫిదా' సినిమా విషయంలో శేఖర్ కమ్ముల మళ్లీ అలాంటి పొరపాటే చేస్తారా?

అక్కడ సినిమా చెయ్యడం అంటే అడుక్కున్నట్టు ఉంటుంది: శేఖర్ కమ్ముల
అక్కడ సినిమా చెయ్యడం అంటే అడుక్కున్నట్టు ఉంటుంది.... అంటూ శేఖర్ కమ్ముల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











