శేఖర్ కమ్ముల సీక్రెట్ షూటింగ్
లీడర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్న శేఖర్ కమ్ముల త్వరలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నసంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా సినిమా గురించి ఎలాంటి సమాచారం కూడా బయటకు రావడం లేదు. షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఎంత వరకు వచ్చింది? ఎప్పడు పూర్తవుతుందనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అసలు షూటింగ్ జరుగుతుందా? లేదా? అనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో యాక్సిడెంట్ లో గాయపడ్డ సినిమాటో గ్రాఫర్ విజయ్ సి. కుమార్ త్వరగా కోలుకుని రావాలని ఎదురు చూస్తున్నాడని, అందుకే షూటింగ్ జరుగడం లేదని అంతా భావిస్తున్నారు.
అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం శేఖర్...తన సినిమా గురించిన సమాచారం బయటకు పొక్కకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నాడని తెలుస్తూంది. ఎందుకు ఇలా చేస్తున్నాడా...? అని ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. సినిమా గురించి నానా హడావుడి చేసి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచితే...తీరా సమయానికి వచ్చేసరికి దెబ్బతినే అవకాశం ఉన్నందున కామ్ గా తన పని తాను చేసుకుపోతున్నాడట. అందుకే సీక్రెట్ గా షూటింగ్ చేసుకుంటూ వెలుతున్నట్లు ఫిల్మ్ నగర్ గుసగుస.


Click it and Unblock the Notifications











