Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
మొదటిసారి ఒక అగ్ర హీరో కోసం స్క్రిప్ట్ రాస్తున్న శేఖర్ కమ్ముల.. అంతకు మించి అనేలా..
దర్శకుడు శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమా చేసినా కూడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న స్టైల్ లోనే హడావుడి కనిపిస్తుంటుంది. పెద్దగా స్టార్స్ తో వర్క్ చేయకపోయినా కూడా కేవలం తన మార్క్ ఇమేజ్ తోనే ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పిస్తుంటారు. ఇక ఇప్పటివరకు మీడియం రేంజ్ యువ హీరోలనే ఎక్కువగా టచ్ చేసిన శేఖర్ కమ్ముల త్వరలోనే ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేయనున్నట్లు టాక్ వస్తోంది.
కొంటె చూపులతో కవ్విస్తోన్న సమంత (బర్త్డే స్పెషల్ ఫొటోలు)
స్టార్స్ తో కూడా..
ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఆ తరువాత మెల్లగా తన స్టైల్ లోనే కొంచెం కొత్తగా ట్రై చేస్తూ వస్తున్నారు. తప్పకుండా స్టార్స్ తో కూడా మ్యాజిక్ క్రియేట్ చేయగలను అని ఫిదా సినిమాతో తానేంటో నిరూపించాడు.
అగ్ర దర్శకులు కూడా ఫిదా
సాయి పల్లవి - వరుణ్ తేజ్ లాంటి విభిన్నమైన నటీనటులను అలా కూడా చూపించవచ్చా అనేలా ఇండస్ట్రీలో అందరికి షాక్ ఇచ్చాడు. సుకుమార్, రాజమౌళి లాంటి దర్శకులు కూడా ఆయనకి అభిమానులే. మేము ఎంత కష్టపడినా కూడా ఆయన టైమింగ్ లో సినిమాలు తీయలేమని సుకుమార్ డైరెక్ట్ గా ఫిదా ఆడియే లాంచ్ లో చెప్పేశాడు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా
ఇక నెక్స్ట్ నాగ చైతన్య - సాయి పల్లవితో మరో వండర్ క్రియేట్ చేసేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. లవ్ స్టొరీ సినిమా ఈ నెలలోమీ విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే సారంగదరియా సాంగ్ 100మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడంతో ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Recommended Video
మొదటిసారి ఒక అగ్ర హీరోతో
అయితే శేఖర్ కమ్ముల తన కెరీర్ లో మొదటిసారి ఒక అగ్ర హీరోతో వర్క్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకటేష్ తో ఒక స్టోరీ అనుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఆయన కంటే ముందే మరొక పెద్ద హీరోను కలిసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వంటి వారు కూడా ఆయన ఆలోచనలో ఉన్నారట. కానీ ఇప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి శేఖర్ కమ్ముల ఎవరితో వర్క్ చేస్తాడో చూడాలి.