మొన్న విజయ్, నిన్న నారా రోహిత్.. పుష్ప కోసం మరో హీరోను సెట్ చేస్తున్న సుకుమార్?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా పుష్ప కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా బన్నీ ఒక న్యూ లుక్ తో కనిపిస్తుండడంతో అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోయాయి. చూస్తుంటే పుష్ప అన్ని భాషల్లో క్లిక్కయ్యేలా ఉందని అనిపిస్తోంది.

పవర్ఫుల్ గా ఉండాలని..
ఇక సినిమాలో అల్లు అర్జున్ హీరో అన్నప్పుడు విలన్ పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉండాల్సిందే. అందులోను దర్శకుడు సుకుమార్ కాబట్టి ఎంత తెలివిగా డిజైన్ చేసుకుంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన డైరెక్ట్ చేసిన గత సినిమాల్లో విలన్స్ కి మాంచి క్రేజ్ దక్కింది. ఇక పుష్ప లో కూడా విలన్ పాత్ర నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. మొన్నటివరకు ప్రతి నాయకుడు ఇతనే అంటూ చాలా మంది అగ్ర నటుల పేర్లు వినిపించాయి. ఇక ఫైనల్ గా ఒక సీనియర్ హీరో దొరికినట్లు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ వల్ల రిజెక్ట్ చేయలేదు
అసలైతే మొదట పుష్ప కోసం కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ యాక్టర్ బిజీగా ఉండడం వలన ప్రాజెక్ట్ ఓకే చేయలేకపోయాడు. మొదట రెమ్యునరేషన్ డిమాండ్ చేసినంత ఇవ్వలేదు అనే రూమర్స్ రాగా అందులో ఎలాంటి నిజం లేదని విజయ్ అఫీషియల్ గా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆల్ మోస్ట్ అతను ఫిక్స్ అన్నారు..కానీ..
ఇక తెలుగులోనే ఒక హీరోని విలన్ రోల్ కోసం సెట్ చేసుకోవాలని దర్శకుడు సుకుమార్ కొంతమందితో చర్చలు కూడా జరిపారు. అందులో ఆల్ మోస్ట్ నారా రోహిత్ ఫైనల్ అయ్యాడని అంతా అనుకున్నారు. కానీ అతను కూడా హీరోగా ట్రై చేస్తున్న సమయంలో అప్పుడే ఇలాంటి పాత్రలు చేసి రిస్క్ చేయలేను అని క్లారిటీగా వివరణ ఇచ్చాడట.
Recommended Video

పుష్పకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాధవన్..
ఇక ఫైనల్ గా సుకుమార్ మాధవన్ ని నెగిటివ్ రోల్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. సపోర్టింగ్ పాత్రలకైనా మెయిన్ లీడ్ కోసమైనా సరే మాధవన్ కరెక్ట్ గా సరిపోతాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఎదిరించే విలన్ గా నటించడానికి రెడీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన నిశ్శబ్దం సినిమాలో అనుష్క సరసన ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక పుష్ప సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











