మహేశ్ మూవీ కోసం ప్రభాస్ పెదనాన్న.. దిమ్మతిరిగే ప్లాన్ రెడీ చేసిన రాజమౌళి

తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసేసిన దర్శకుల్లో అందరి కంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు దర్శకధీరుడు రాజమౌళిదే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో టాలీవుడ్‌‌లో తన హవాను చూపించిన ఆయన.. 'బాహుబలి' నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే RRRతో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా పేరొందిన రాజమౌళి ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టును సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఇంకా మొదలెట్టలేదు. అన్నీ రెడీ అయిన తర్వాతనే రెగ్యూలర్ షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.

Senior Actor Nassar Onboard for Rajamouli and Mahesh Babu Movie

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే క్రేజీ సినిమా స్క్రిప్ట్ బాధ్యతను జక్కన్న ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించినట్లు స్వయంగా వెల్లడించాడు. ఆయన కూడా ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్‌లో రాబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అప్పటి నుంచి దీనిపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా కోసం సౌతిండియన్ సీనియర్ స్టార్ నాజర్ రంగంలోకి దిగారట. ఆయనకు దర్శకుడు రాజమౌళి ఓ బాధ్యతను అప్పగించినట్లు సమాచారం.

Senior Actor Nassar Onboard for Rajamouli and Mahesh Babu Movie

సీనియర్ యాక్టర్ నాజర్‌కు డైలాగ్ డెలివరీ మీద చాలా పట్టు ఉంది. ఆయనకు చాలా భాషల్లో ప్రావీణ్యం కూడా ఉంది. అందుకే సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఇందులో ట్రైనింగ్ ఇచ్చేందుకు రాజమౌళి.. నాజర్‌కు బాధ్యతలు అప్పగించారట. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ స్టార్ హీరో.. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ఈ వర్క్ స్టార్ట్ చేస్తారని తెలిసింది.

ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. దీనికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషించబోతున్నారు.

More from Filmibeat

Read more about: mahesh babu ss rajamouli nassar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X