twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా విలయతాండవం: షూట్ కి రాలేనన్న సీనియర్ నటుడు..అర్ధాంతరంగా ఆగిన షూట్?

    |

    కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్ భయంకరంగా ఉంది. ఎవరూ ఊహించని విధంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొదటి వేవ్ లో కరోనా కేసులు తక్కువగానే ఉండేవి. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైన తర్వాత సెకండ్ విజృంభించింది. ఈసారి లక్షణాలు కూడా కనిపించకుండా కొందరు మనుషులు మృత్యువాత పడే వరకు కరోనా వదలడం లేదు. చనిపోతున్న వారిలో గనుక కరోనా ఉందని ముందే తెలిసి ఉంటే, జాగ్రత్త పడి ఉంటే బతికి ఉండే వారు అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న కారణంగా ఇప్పుడు దాదాపు అన్ని రంగాల మీద మరలా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

    50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన

    50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన

    నిజానికి అన్ని రంగాల కంటే ముందుగా తెలుగు సినిమా రంగం కాస్త పుంజుకుంది. అయితే ఎంత త్వరగా పుంజుకుంటూ అంతే త్వరగా ఇప్పుడు మళ్ళీ తిరోగమన దిశలో పయనిస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు చాలా విషయాల్లో కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నాయి.

    అదే నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ఆక్యుపెన్సీ నిబంధన లేకపోవడంతో వందకు వంద శాతం సీట్లు ఫుల్ అవుతున్నాయి. మనుషుల మధ్య సోషల్ డిస్టెన్స్ లేక ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వాల దృష్టికి ఆరోగ్య శాఖ తీసుకెళ్ళింది.

    Recommended Video

    Sarkaru Vaari Paata దూకుడు తరహాలో.. Mahesh Babu ట్రెండింగ్ !
    యూనిట్ కి షాక్ ఇచ్చిన జగపతిబాబు

    యూనిట్ కి షాక్ ఇచ్చిన జగపతిబాబు

    ఇప్పటికే ఈ ఆక్యుపెన్సీ నిబంధనలు విధిస్తారు ఏమో అనే అనుమానంతో చాలా తెలుగు సినిమాలు వాయిదా పడ్డాయి.. బడా హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఒకపక్క ఇంత జరుగుతున్నా మరోపక్క సినిమా షూటింగులు మాత్రం ఆగడం లేదు.

    ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ లో ఒకరికి కరోనా సోకిన దాదాపు అది చాలా మంది మీద ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే 12 సినిమా షూటింగులు ఈ కరోనా కేసులు అనుకోకుండా నమోదు కావడం వల్ల వాయిదా పడ్డాయి. అయితే తాజాగా తాను షూటింగ్ లో నటించాలి అని చెప్పి యూనిట్ కి షాక్ ఇచ్చారు సీనియర్ నటుడు జగపతిబాబు.

    కరోనా నేపథ్యంలో

    కరోనా నేపథ్యంలో

    లెజెండ్ సినిమా తో రీ ఎంట్రీ తర్వాత మళ్ళీ జగపతిబాబు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. అప్పటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు మొదలు మంచి విలన్ పాత్రలు పోషిస్తూ తెలుగులో సత్తా చాటుతున్నారు ఆయన. దాదాపు తెలుగులో హిట్ అయిన అన్ని సినిమాల్లో ఆయన పాత్ర కనిపించాల్సింది. ఇక తాజాగా ఆయన శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న మహాసముద్ర అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతోంది. అయితే కరోనా నేపథ్యంలో తాను సినిమా షూటింగ్ చేయలేనని చెప్పి ఆయన షాకిచ్చాడట. ఆయన కాంబినేషన్ సీన్లు మాత్రమే ఎక్కువగా ఉండడంతో అప్పటికప్పుడు సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రస్తుతం జగపతిబాబు వయస్సు 59 సంవత్సరాలు.

    కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా సరే

    కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా సరే

    అయితే వయసుతో సంబంధం లేకుండా చాలామంది కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నా సరే పాజిటివ్ అని వస్తోంది. వాస్తవానికి అలా రాకూడదు కానీ వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా పాజిటివ్ అని రావడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. నిజానికి అల్లు అరవింద్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నాక మళ్ళీ కరోనా సోకింది. కరణాలు తెలిసింది. ఇక జగపతి బాబు బాటలోనే టాలీవుడ్ సీనియర్ నటులు కరోనా నేపథ్యంలో తాము షూటింగులకు రాలేమని ఆయా సినిమా యూనిట్లకి చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. నిజమే కదా మరి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా.

    English summary
    Akhil Akkineni is awaiting the release of his upcoming film Most Eligible Bachelor which is helmed by Bommarillu Bhaskar. The film is slated for release on 19th June. Akhil trying to change his movies genre in order to get success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X