బాలకృష్ణ సినిమా.. ఊహించని రేంజ్ లో రెమ్యునరేషన్ అడుగుతున్న స్టార్ హీరోయిన్!
నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ మసాలా కమర్షియల్ మూవీ పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు పోస్టర్స్ కూడా ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే నమ్మకంతో ఆడియన్స్ ఉన్నారు.
అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నుంచి మరొక బిగ్ బడ్జెట్ మాస్ కమర్షియల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ సినిమాను చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఓకే అయిపోయింది. ఇప్పటికే కొంతమంది నటీనటులను కూడా ఫైనల్ చేసేసారు. అందులో బాలకృష్ణ కూతురుగా శ్రీ లీలా కూడా ఫిక్స్ అయింది. ఇక మెయిన్ హీరోయిన్ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు ఎలాంటి క్లారిటీకి రాలేదని తెలుస్తోంది.

ఆ మధ్య అయితే నయనతార ఫిక్స్ అయినట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇంకా అధికారికంగా ఎవరూ మాత్రం క్లారిటీగా చెప్పలేదు. ఇక ప్రస్తుతం వస్తున్న టాక్ ప్రకారం నయనతార ఆ సినిమా కోసం ఊహించని స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం నయనతార దాదాపు 8 నుంచి 9 కోట్ల మధ్యలో పారిపోషికం అడుగుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకి నయనతార 9 కోట్లు నుంచి 10 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు రాబోయే భవిష్యత్తు ప్రాజెక్టులకు దాదాపు ఆమె అదే తరహాలో అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ తో ఆమె ఇది వరకే బాక్సాఫీస్ సినిమాలో నటించింది. కాబట్టి ఈసారి కాంబినేషన్ కు కూడా మంచి డిమాండ్ ఉంటుంది అని ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











