»   » వ్యభిచారినిగా నటి స్నేహ

వ్యభిచారినిగా నటి స్నేహ

Posted By:
Subscribe to Filmibeat Telugu

వేశ్యలకు, సినిమా హీరోయిన్లకు అవినాభావ సంబంధం ఉంది. కొందరు హీరోయిన్లు నటనలో మంచి పేరు తెచ్చుకోవడం కోసం వేశ్య పాత్రలు చేసేందుకు ఉబలాట పడుతుంటారు. మరికొందరు హీరోయిన్లు అవకాశాలు తగ్గి పోయి బ్రతుకు బండి భారమైన వేష్యలుగా మారుతుంటారు.

తాజాగా విషయానికొస్తే...సీనియర్ నటి స్నేహ త్వరలో వేష్యగా మారబోతోంది. నిజజీవితంలో అనుకునేరు. అస్సలు కాదు. వెండి తెరపై వేశ్యగా కనిపించబోతోంది. సీనీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ బ్యానర్ లో ఓ ప్రఖ్యాత దర్శకుడి దర్శకత్వంలో సినిమా రూపొందబోతోందని, అందులో స్నేహ వేశ్య పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. ' ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ ప్రాసిట్యూట్" అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.

వయసులో బాగా ముదిరి పోయిన స్నేహ ప్రస్తుతం అవకాశాలు లేక వెకబడి పోయింది. ఇలాంటి పాత్రలు చేయడం ద్వారా మళ్లీ తన కెరీర్ ఊపందుకుంటుందని ఆమె ఆశ. మరి ఈ వేశ్య వేషం ఆమెకు ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి.

English summary
A noted production banner has roped in a talented director and they are keen to make a movie based on a book titled ‘The Autobiography Of A Prostitute’. Sources say they are planning to approach Sneha to do the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu