Sneha: భర్తతో గోడవపడిన సీనియర్ హీరోయిన్ స్నేహ.. షాకింగ్ డిసిషన్?
సినిమా ప్రపంచంలో కొంతమంది సినీ తారలు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుని ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకే విడిపోతూ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం అనేది కొత్తేమీ కాదు ఇటీవల కాలంలో అయితే వాటి సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది. ఇక త్వరలోనే మరొక హీరోయిన్ కూడా భర్తతో విడిపోయే అవకాశం ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆమె మరెవరో కాదు స్నేహ అని కూడా తెలుస్తోంది.. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

విభిన్నమైన సినిమాలు
సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపును అందుకున్న అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో స్నేహ ఒకరు. ఆమె ముఖ్యంగా ట్రెడిషనల్ హోమ్లీ పాత్రలతో ఎంతగానో మెప్పించారు. ప్రేమ కథలలో మాత్రమే కాకుండా మంచి భక్తిరస చిత్రాలలో కూడా నటించి గుర్తింపు అందుకున్నారు. తెలుగులో శ్రీరామదాసు సినిమాలో ఆమె నటించిన విధానానికి అందరూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. రవితేజతో చేసిన వెంకీ సినిమా కూడా ఆమెకు మంచి సక్సెస్ ను అందించింది.

నటుడితో పెళ్లి
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన స్నేహ 2012 వరకు కూడా హీరోయిన్ గానే కనిపించింది. ఇక ఆ తర్వాత ఆమె తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకోవడంతో కొంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

పెళ్లి తరువాత
ఇక ప్రసన్నను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరమవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ స్నేహ తన వయసుకు తగ్గ పాత్రలలో నటించేందుకు సిద్ధమయింది. ప్రస్తుతం స్నేహ వయసు 41 సంవత్సరాలు. ఇక వినయ్ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ కు వదిన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

భర్తతో విబేధాలు
అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు స్నేహ తన భర్తతో అలాగే పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహ ఇప్పుడు భర్తకు దూరంగా ఉంటుంది అని మీడియాలో సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ గా మారుతుంది. అందుకు కారణం భర్తతో వచ్చిన విభేదాలు అని కూడా సౌత్ మీడియాలో ఇప్పుడు కొన్ని కథనాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

పిల్లలతో కలిసి..
సినిమా ఇండస్ట్రీలో ఈ జంటకు మంచి గుర్తింపు అయితే ఉంది. ఎందుకంటే ఎలాంటి ఈవెంట్స్ కు వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి వెళతారు. అన్యోన్యమైన దాంపత్యం తో కొనసాగి వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే నమ్మడానికి కొంత అనుమానంగానే ఉంటుంది. ప్రస్తుతం టాక్ ప్రకరమైతే స్నేహ తన పిల్లలను తీసుకొని భర్తకు దూరంగానే ఉంటున్నట్లుగా కథనాలు ఒక రేంజ్ లో వస్తున్నాయి. అయితే ఈ వార్తలు గత రెండు రోజులు నుంచి వైరల్ అవుతున్నా ఇంతవరకు స్నేహ క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఆమె ఏదో ఒక క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










