బాలకృష్ణ చేయాల్సిన సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. సీనియర్ డైరెక్టర్ బడా ప్లాన్
నందమూరి బాలకృష్ణ కూడా నేటితరం యువ హీరోలు తరహాలోనే ఎంతో వేగంగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. షూటింగ్ పనులను కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఫాస్ట్ గానే ఫినిష్ చేసుకుంటున్నాడు. వీలైనంతవరకు అభిమానులకు నచ్చే విధంగా మాస్ కమర్షియల్ సినిమాలను ఎక్కువగా చేస్తున్నాడు. మొత్తానికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేశాడు. ఇటీవల ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా షూటింగ్ పనులన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. ఇక వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి.. సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ తో బిజీ అవ్వాలని అనుకుంటున్నారు.
అయితే బాలకృష్ణ చేయాల్సిన ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేసే అవకాశమున్నట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఒక సీనియర్ దర్శకుడు గతంలో బాలకృష్ణకు చెప్పిన కథ విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఆ కథను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మార్చి భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ తో ఇదివరకే రాఖీ అనే సినిమా చేసిన కృష్ణవంశీ. చాలాకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న కృష్ణవంశీ ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆలోచిస్తున్నాడు.

ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరాఠీ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఆ సినిమా అనంతరం రైతు అనే మరొక ప్రాజెక్ట్ ను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని కృష్ణవంశీ ఆరాటపడుతున్నాడు. నందమూరి బాలకృష్ణ తో చేయాలని అనుకున్నారు కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా సెట్టవ్వలేదు. ఇక అదే కథనం జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన రాఖీ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే హిట్ అవ్వలేదు. కానీ ఆ సినిమా ద్వారా ఎన్టీఆర్ కు నటుడిగా మంచి గుర్తింపు దక్కింది.
మరోసారి ఎన్టీఆర్, కృష్ణవంశీతో సినిమా చేయాలని చాలాసార్లు చర్చలు జరిపాడు. కానీ సరైన ప్రాజెక్ట్ సెట్టవ్వలేదు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అడుగులు పాన్ ఇండియా వైపు పడుతున్నాయి. ఇక కృష్ణవంశీ జూనియర్ గురించి ఆలోచించి అతనితోనే రైతు కథను కూడా నేషనల్ లెవెల్ లోనే మంచి సందేశంతో తెరకెక్కించాలని అనుకుంటున్నాను. మరి జూనియర్ ఎన్టీఆర్ కృష్ణ వంశీకి ఇంతవరకు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే మొత్తానికి RRR కు సంబంధించిన కీలకమైన పనులను పూర్తి చేసుకున్నాడు. నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. అనంతరం KGF 2 దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











