NBK109: బాలయ్యతో సీనియర్ హీరోయిన్ విరోధం... మరో శివగామి కానుందా?

2023లో వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ. మరి ఆయన ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తన 109 సినిమాలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు అయింది. అయితే ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ విలన్ భార్యగా నటించనుందని ఓ సమాచారం బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాతో ఆమె మరో శివగామి కానుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే....

బాలయ్య ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో... నంబర్ 1 హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేసి సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది బాలకృష్ణ రెండు సూపర్ హిట్లతో జోష్ మీద ఉన్నాడు.

Senior Heroine Raasi play the role of negative shade in Bobby Nandamuri Balakrishnas 109 movie Full Details Here

ఇక ప్రస్తుతం బాలయ్య ఎన్బీకే 109 సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించడంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఇక ఇటీవల ఓ పోస్టర్ కూడా రిలీజ్ అవ్వగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో మరింత పవర్‌ ఫుల్‌ రోల్‌ లో బాల‌య్య నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే బాలయ్య సినిమాలో అలనాటి సీనియర్ హీరోయిన్ రాశి నటిస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్ భార్యగా రాశి కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో రాశి నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించనుందని టాలీవుడ్ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇక రాశి.. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి... సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ సినిమాతో రాశి... మరో శివగామి రమ్యకృష్ణలా కానుందని వార్తలు వస్తున్నాయి.

Senior Heroine Raasi play the role of negative shade in Bobby Nandamuri Balakrishnas 109 movie Full Details Here

ఇక బాలకృష్ణ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాశి కూడా భాగం అయితే.. ఈ సినిమాలో గ్లామర్ టచ్ బాగానే ఉందని తెలుస్తోంది. ఇక రాశి.. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. బాలయ్య సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత కృష్ణ బాబు సినిమాలో ఆయనకు జోడిగా నటించింది. ఇప్పుడు ఆయనకు నెగిటివ్ క్యారెక్టర్ గా ఉండే పాత్రలో నటించబోతుందని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో రాశి సినిమాలకన్నా సీరియల్స్ లోనే ఎక్కువుగా కనిపించగా.. ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక బాలయ్య సినిమా కావడంతో ఆఫర్ వదులుకోవడం ఇష్టం లేక.. విలన్ పాత్ర అయినా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. నిజం అయితే బాగుండు అని బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X