మరోసారి ఆ మాస్ దర్శకుడితో బాలయ్య బిగ్ మూవీ.. టైటిల్ ఏంటో తెలిస్తే విజిల్ పక్కా!
తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. రామ్ కెరియర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత పూరీ మళ్లీ ఫాంలోకి వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తీశాడు. అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన ఆ చిత్రం ప్లాప్ గా నిలిచింది. దీంతో మళ్లీ పూరి ప్లాపులకు సొంతం అయ్యాడు.
దాని నుంచి కోలుకొని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని పూరీ ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ స్పెషల్ స్టోరీ రాసుకున్నట్లు సమాచారం. అది కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. పార్ట్-1లో లాగే ఈ చిత్రంలో కూడా రామ్ ఏ హీరోగా నటించబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాకు బదులుగా పూరీ జగన్నాథ్ నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారట. అలాగే ఇది ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ కాదని.. కాకపోతే ఫుల్ మాస్ మసాలా మూవీ అని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి 'కాకా' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాదే ప్రకటించ బోతున్నారని కూడా అంతా అనుకుంటున్నారు.
మాస్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వేల్ అనగానే అంతా చాలా ఎగ్జైట్ అయ్యారు. సినిమాకు సంబంధించిన అప్ డేట్లు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా.. సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారని పెద్ద ఎత్తున గూగుల్ సెర్చ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కాదు.. బాలయ్య బాబుతో సినిమా అనగానే మరోసారి ఈ న్యూస్ వైరల్ అయ్యింది.

కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్ మసాలా సినిమా, అందులోనూ ఎలాగైనా హిట్టు కొట్టాలని బాగా కసితో ఉన్న పూరీ జగన్నాథ్ తో అంటే మరింత ఎగ్జైట్ అవుతున్నారు. చూడాలి మరి వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రంలో ఎవరు నటించబోతున్నారు, సినిమా కథ ఎలా ఉందో. ఇంకా కొంత కాలం గడిస్తే తప్ప ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్ డేట్లు బయటకు వచ్చేలా లేవు.


Click it and Unblock the Notifications











