తెరవెనుక సైరాని నడిపిస్తున్నది అతడే.. రాంచరణ్ కోసం!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉత్కంఠతో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర భారీ షెడ్యూల్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి యుద్ధ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. తాజగా ఈ చిత్ర బడ్జెట్ గురించి ఆసక్తిరేకెత్తించే వార్త ప్రచారం జరుగుతోంది.

డ్రీమ్ ప్రాజెక్ట్
సైరా నరసింహారెడ్డి చిత్రం మెగాస్టార్ చిరంజీవి కలల చిత్రం చాలా ఏళ్ల క్రితమే ఈ చిత్రాన్ని చేయాలని మెగాస్టార్ భావించాడు. ఇప్పటికి కుదిరింది. తన తండ్రి ఇష్టపడి చేస్తున్న చిత్రం కావడంతో రాంచరణ్ ఖర్చుకు వెనుకాడడం లేదు. చిత్ర యూనిట్ అంచనా వేసిన అంచనా ప్రకారం ఈ చిత్రానికి 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

తెరవెనుక ఉండి
సైరా చిత్రానికి ఎంతైనా ఖర్చు చేసేందుకు రాంచరణ్ సిద్ధంగా ఉన్నాడు. కానీ భారీ బడ్జెట్ కావడంతో ఇండస్ట్రీలోని మరో బడా నిర్మాత డివివి దానయ్య సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ పరంగా దానయ్య రాంచరణ్ కు సాయం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బిజినెస్ పూర్తయ్యాక
డివివి దానయ్య ఇచ్చిన మొత్తాన్ని సైరా చిత్ర బిజినెస్ పూర్తికాగానే రాంచరణ్ తిరిగి చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సైరా చిత్రంలో డివివి దానయ్య వాటా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనేది ఓ ప్రచారం.

దానయ్య నిర్మాణంలోనే
ప్రస్తుతం రాంచరణ్ డివివి దానయ్య నిర్మిస్తున్న బోయపాటి చిత్రంలోనే నటిస్తున్నాడు. గతంలో రాంచరణ్ బ్రూస్ లీ చిత్రాన్ని నిర్మించింది కూడా దానయ్యే. రాజమౌళి తెరకెక్కించే మల్టీస్టారర్ చిత్రానికి కూడా దానయ్యే నిర్మాత కావడం విశేషం.


Click it and Unblock the Notifications











