twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ ఏజెంట్ సినిమా కోసం మరో స్టార్ హీరో.. సైరా దర్శకుడు అస్సలు తగ్గట్లేదు!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎంతగానో కష్టపడుతున్న హీరోల్లో అక్కినేని అఖిల్ కూడా ఉన్నాడు. అక్కినేని బ్రాండ్ తో వచ్చిన నాగ్ తనయుడు ఇండస్ట్రీలోకి వచ్చి అరేళ్లయినా ఇంకా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ చూడలేదు. ఎలాగైనా హిట్టు కొట్టాలని ఇప్పుడు ఏజెంట్ సినిమాతో సరికొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఆ సినిమాలో ఒక స్టార్ హీరో కూడా ప్రత్యేకమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

     ఎవరు ఊహించలేదు.

    ఎవరు ఊహించలేదు.

    అక్కినేని అఖిల్ మొదటి సినిమాతోనే ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అసలు సినిమా ఆ రేంజ్ లో ప్లాప్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఆ తరువాత చేసిన హలో, మిస్టర్ మజ్ను సినిమాల కోసం బాగానే కష్టపడినప్పటికి కూడా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు.

    లాక్ డౌన్ కారణంగా

    లాక్ డౌన్ కారణంగా

    అఖిల్ నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం తరువాత డైరెక్ట్ చేసిన ఈ సినిమాను లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశారు. అసలైతే జూన్ 19న విడుదల తేదిని ప్రకటించినప్పటికీ కరోనా ప్రభావం వల్ల ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఏజెంట్ కోసం..

    ఏజెంట్ కోసం..

    ఇప్పటివరకు అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు అనుకున్నంతగా బజ్ అయితే పెరగలేదు. కానీ ఆ తరువాత రాబోయే ఏజెంట్ సినిమాపై మాత్రం అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఫస్ట్ లుక్ తోనే బజ్ పెంచేశారు. సైరా అనంతరం దర్శకుడు సురేందర్ రెడ్డి మళ్లీ తన మాస్ యాక్షన్ ఫార్మాట్ లోకి వచ్చేశాడు. సినిమా కోసం అఖిల్ న్యూ స్టైల్, న్యూ ఫీట్నెస్ తో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

    పవర్ఫుల్ పాత్రలో.. ఉపేంద్ర

    పవర్ఫుల్ పాత్రలో.. ఉపేంద్ర

    ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ కోసమే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారట. మొత్తం సినిమా బడ్జెట్ 40కోట్లు దాటనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక సినిమాలో మరొక స్టార్ హీరో కూడా నటించనున్నట్లు టాక్ వస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒక పవర్ఫుల్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇంతకుముందు అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన ఉపేంద్ర మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు అఖిల్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    English summary
    Akkineni Akhil is also one of the heroes who are currently working hard for success in the Tollywood industry. Nag's son, who came up with the Akkineni brand, came into the industry six years ago and has yet to see proper success at the box office. Agent is now making a fresh attempt with the film to hit the ground running anyway. It is reported that a star hero will also be playing a special role in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X