twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'స్టాలిన్' దర్శకుడుతో రామ్ చరణ్ మరో హిస్టరీ..!?

    By Sindhu
    |

    గజిని చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ ఒక చిత్రాన్ని చెయ్యబోతున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దర్శకుడు మురుగదాస్ ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ దృష్టినీ ఆకర్షించిన మురుగదాస్ ప్రస్తుతం సూర్య, శృతిహాసన్ జంటగా నటిస్తున్న 'సెవెన్త్ సెన్స్" సినిమాని తెరకెక్కించిన విషయం విధితమే. దీపావళికి ఈ సినిమా విడుదలవుతుండా టాలీవుడ్ లో ఓ యంగ్ హీరోతో సినిమా చేయబోతున్నానని మురుగాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.

    చిరంజీవి హీరోగా రూపొందిన 'స్టాలిన్" చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు ఎఆర్ మురుగదాస్ కి తాజాగా రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఓ స్టైయిట్ సినిమా చేసి, అందులో రామ్ చరణ్ ని హీరోగా నటింపజేయడానికి మురుగదాస్ సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

    'మగధీర" లో రామ్ చరణ్ నటన చూసిన తర్వాత మురుగదాస్ చాలా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. దాంతో తెలుగులో సినిమా చేస్తే చరణ్ తోనే చేయాలని ఈ దర్శకుడు డిసైడ్ అయ్యినట్టు సమాచారం. సూర్య హీరోగా నటిస్తున్న "7 వ సెన్స్" ఆడియో లాంచ్ ఫంక్షన్లో హీరో రామ్ చరణ్ తేజ్ చేసిన ప్రసంగం అతనిలో వస్తున్న పరిపక్వతను చాటింది. సుప్రసిద్ధ డైరెక్టర్ మురుగుదాస్ తో చిత్రం చేయాలన్న తన అభిమతాన్ని చరణ్ బయటపెట్టిన విషయం తెలిసిందే. మరి ఆ కోరిక త్వరగానే తీరేలా వుంది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు తెరకెక్కుతోందో వేచి చూడాల్సిందే.

    English summary
    Tamil director Murugadoss is a well known director in Andhra Pradesh with original version of Chiranjeevi's Tagore and Surya's Ghajini. Muruga's only straight Telugu film Stalin had Chiranjeevi as the lead man and Murugadoss is not so pleased with its average result.Murugadoss is well known for his awesome concepts and different characterizations.He seems to have decided to show a total new 'Ram Charan' with this movie. Ram Charan is right now busy with his Racha and he too is waiting for a movie which beats out his Magadheera. Adding to this, Muruga is promising to create history with Ram Charan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X