ఎలక్షన్స్ దగ్గరపడుతూండటంతో ఫేడవుట్ అయిన సిని తారలు కి కూడా చేతినిండా పనివచ్చి పడుతోంది. తాజాగా ఆ లిస్టులో సెక్స్ బాంబు షకీలా చేరనుందని సమాచారం. ఆమెకు మంచి రేటుతో టీడీపి ప్రచారానికి ఆఫర్ చేసారని వినపడుతోంది. ఓ ప్రక్క కాంగ్రెస్ త్రిషను రంగంలోకి దింపటానికి ప్రయత్నం చేస్తూంటే..తెలుగుదేశం షకీలాను దింపటంలో ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే సినిమాల్లో మాస్ ఐటం సాంగ్ కి వ్యాల్యూ ఉన్నట్లే కొన్ని ఏరియాల్లో షకీలా అంటే విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందని, వారిని క్యాష్ చేసుకోవటానికి ఇది ఊహకందని వ్యూహం అని అంటున్నారు. అయితే ఈ నిర్ణయానికి మాత్రం ఇంకా బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటుననారు. అయితే కవిత వంటి మహిళా నాయకులకు కన్నా ఆమెకే ఎక్కువ స్పందన వస్తుందని ఇప్పటికే కొందరు గుసగుసలాడుతున్నారు.