శ్రీకాంత్ అడ్డాలను వదలని సెక్సీ హీరోయిన్
కొత్తబంగారు లోకం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన శ్వేత బసు ప్రసాద్ కెరీర్ ప్రస్తుతం ఫైనల్ స్టేజీలో ఉంది. అమ్మడు చేతిలో ఇప్పడు కనీసం ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా లేదు. దీంతో ఏం చేయాలో తోచక అయోమయంలో ఉన్న శ్వేత నువ్వే కాపాడాలి, నా జీవితం నువ్వే నిలబెట్టాలి అంటూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వెంట పడుతోందట.
శ్వేత శ్రీకాంత్ అడ్డాల వెంట పడటానికి కారణం...ప్రస్తుతం ఆయన దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే సినిమాకు దర్శకత్వం వహించ బోతున్నారు. ఇందులో స్టార్ యాక్టర్స్ వెంకటేష్, మహేష్ బాబులు లీడర్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎలాగైనా సెకండ్ హీరోయిన్ చాన్స్ ఇప్పించాలని అతనిపై ఒత్తిడి తెస్తుంది.
అంతపెద్ద పాత్ర నీకు ఇచ్చి రిస్కు తీసుకోవడం నావల్ల కాదు కానీ...ఏదో ఒక పాత్ర ఇప్పిస్తానని శ్రీకాంత్ మాట ఇచ్చాడని సమాచారం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం...శ్వేత బసు వెంకటేష్ చెల్లెలి పాత్రలో గానీ, హహేష్ బాబు మరదలు పాత్రలో కానీ కనిపించే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











