ఇద్దరి మధ్యా ముద్దుల మమతా....

By Staff

Mamta Mohandas
గాయనిగా,నటిగా తనదైన శైలిలో ద్విపాత్రాభినయం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్న మళయాళ ముద్దుగుమ్మ మమాతా మోహన్ దాస్. ప్రస్తుతం ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆమె హవా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో బాగా కొనసాగుతోంది. ఎంత బిజీగా ఉందంటే యు.స్.నుండి వెంకటేష్ 'చింతకాయల రవి' షూటింగ్ ముగించుకు వచ్చిన వెంటనే రెస్ట్ కూడా తీసుకోకుండా వెంటనే తర్వాత సినిమా కి అటెండయిపోవల్సివచ్చింది.

అంతెందుకు మొన్న 'విక్టరీ' సినిమా రిలీజై నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ ప్రభావం ఆమె కెరీర్ పై కొంచెం కూడా పడకపోవటం విశేషం. ఇక ఆమె జగపతి బాబు ప్రక్కన చేసిన హోమం సినిమా రిలీజ్ గురించయితే చాలా ఏంగ్జయిటీగా వెయిట్ చేస్తోంది. అందులో ఆమె డాక్టర్ పాత్రను పోషించిందిట. కథ సిట్యువేషన్ గా ప్రకారం వచ్చే ఒక పాటను కూడా పాడింది. ఆ పాట సినిమాలోని మెయిన్ పాత్రలైన జగపతిబాబు,జె.డి చక్రవర్తి ఇద్దరూ ఒకేసారి ప్రేమను వెళ్ళబుచ్చేటప్పుడు వస్తుందిట.

ఆ సినిమా పోస్టర్స్ కూడా చాలా హాట్ గా ఉండి ఆమె క్రేజ్ ని మరింత పెంచుతున్నాయి. దాంతో ఆమె చాలా ఉషారుగా ఉంది. అలాగే తమిళంలో మాధవన్,అబ్బాస్ ప్రధాన పాత్రలుగా చేస్తున్న సినిమాలో చేస్తోందిట.అదీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీనేట. తెలుగులోనూ అలాంటిదే,తమిళంలోనూ అదే రకం పాత్ర రావటం విచిత్రం కదా అంటోంది. కరెక్టేగా ఇద్దరు మగవాళ్ళు పోటిపడే పాత్ర అంటే గ్లామరే కదా....అలాంటివి ఎవరు ఇష్టపడరు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X