»   » అవమానాన్ని తట్టుకోలేక పోతున్న ఇలియానా

అవమానాన్ని తట్టుకోలేక పోతున్న ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమాలతో పాటు సౌత్‌లో ఓ వెలుగు వెలిగి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన గోవా సుందరి ఇలియానా....'బర్ఫీ" సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్‌లో మాదిరి బాలీవుడ్‌లోనూ టాప్ రేంజ్‌లోకి ఎదిగి పోవాలని ఆశపడుతున్న ఈ భామ....రణబీర్‌తో కాస్త క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తే బాలీవుడ్ లో పరిచయాలు పెరుగుతాయని, తద్వారా మరిన్ని అవకాశాలు దక్కించుకోవచ్చని బోలెడు ఆశలతో ముంబైలో అడుగు పెట్టింది.

ఆదిలోనూ హంస పాదు అన్నచందంగా.... ఇలియాన ఆశలు అడియాశలయ్యాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లలో హీరోలు, దర్శక నిర్మాతలతో మంచి గౌరవ మర్యాదు పొందిన ఇలియానను... బాలీవుడ్‌లో కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోవడం లేదు. కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదట. ఇలియానా క్లోజ్‌గా మూవ్ అవుతుంటే...రణబీర్ ఆమెను కావాలని దూరం పెడుతున్నాడట. 'బర్ఫీ" సినిమాకు సంబంధించినంత వరకు మాత్రమే ఆమెతో ఇంటరాక్ట్ అవుతూ...తర్వాత అస్సలు పట్టించుకోవడం లేదు.

దీన్ని అవమానంగా భావిస్తున్న ఇలియాన...లోలోపల కుమిలి పోతోంది. సౌత్‌లో తాను అనుభవించిన రాజభోగాల్ని, మర్యాదలను ఇక్కడ పడుతున్న పాట్లను తలుచుకుని మదన పడుతోందట.

English summary
Sexy star heroine ileana insulted in bollywood.
Please Wait while comments are loading...