»   » బ్యాట్‌మెన్‌గా షారుక్‌ఖాన్.. బెన్ అఫ్లెక్‌ తొలగింపు.. హాలీవుడ్‌లో అరుదైన సత్కారం..

బ్యాట్‌మెన్‌గా షారుక్‌ఖాన్.. బెన్ అఫ్లెక్‌ తొలగింపు.. హాలీవుడ్‌లో అరుదైన సత్కారం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హాలీవుడ్‌లోకి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన షారుక్ ఖాన్ బ్యాట్‌మెన్‌గా కనిపించనున్నారు అనే రూమర్ విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఇప్పటికే ఆ పాత్రకు ఖారారు చేసిన హాలీవుడ్ నటుడు బెణ్ అఫ్లెక్‌ను ఆ పాత్ర నుంచి తప్పించి షారుక్‌ను తీసుకొన్నారనే వార్త వినిపిస్తున్నది. ఈ మేరకు సంబంధిత ప్రొడక్షన్ హౌస్‌తో మూడు చిత్రాలు చేసేందుకు షారుక్ ఒప్పందం చేసుకొన్నాడు అని ఓ ఆంగ్ల దిన పత్రిక ఏప్రిల్ ఫూల్ కథనంగా వెల్లడించింది. అయితే షారుక్‌ను ఇంకా తీసుకొన్న విషయంపై సందేహాలు ఉన్నప్పటికీ.. బెన్ అఫ్లెక్‌ను తప్పించారనే వార్త మాత్రం వాస్తవమనే విషయం వినిపిస్తున్నది.

బెన్ అఫ్లెక్‌కు టాటా..

బెన్ అఫ్లెక్‌కు టాటా..

ఆంగ్ల వెబ్ సైట్ వెల్లడించిన ప్రకారం.. బ్యాట్‌మెన్ పాత్ర నుంచి బెన్ అఫ్లెక్‌ను తప్పించి షారుక్ ఖాన్‌ను తీసుకొన్నాం. ఈ ఒప్పందం అమలు అయ్యేందుకు మరికొంత సమయం పడుతుంది. మూడు చిత్రాల్లో నటించేందుకు కాంట్రాక్టుపై షారుక్ సంతకం చేశారు. బ్యాట్‌మెన్‌ పాత్రలో షారుక్‌ను ప్రపంచ సినీ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకొంటారనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. భారత్‌లోని సినీ ప్రేక్షకులకు ఇది పండుగ లాంటి వార్త అని పేర్కొన్నది.

 పరిశీలనలో హ్యూ జాక్సన్ పేరు

పరిశీలనలో హ్యూ జాక్సన్ పేరు

తాజా బ్యాట్‌మెన్ చిత్రానికి బెన్ అఫ్లెక్ దర్శకుడు. బ్యాట్‌మెన్ పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయనను నటుడిగా, దర్శకుడిగా తొలగించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. వాల్వెరైన్ లెగసీని కొనసాగించడానికి షారుక్ అనే సరైన నటుడు అని చిత్ర నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాత్ర కోసం హ్యూ జాక్సన్‌ను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు అని కథనంలో తెలిపింది.

అఫ్లెన్‌ను బలవంతంగా..

అఫ్లెన్‌ను బలవంతంగా..

ఆస్కార్ అవార్డు గ్రహీత బెన్ అఫ్లెక్‌ను బలవంతంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు వార్తలు అందుతున్నాయి. బ్యాట్‌మెన్‌గా అఫ్లెక్‌ను చూడటం ప్రేక్షకులకు రుచించడం లేదనే విమర్శల నేపథ్యంలో ఆయనను తప్పించినట్టు రూమర్ విస్తృతంగా ప్రచారమవుతున్నది.

ప్రస్తుత పరిస్థితుల్లో హాలీవుడ్‌లో ఇండియన్ యాకర్లకు మంచి డిమాండ్ పెరుగుతున్నది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే హాలీవుడ్‌లో దుమ్ము రేపుతున్నారు. ఒకవేళ బ్యాట్‌మెన్‌గా షారుక్ నటించనున్నారనే వార్తతో వాస్తవమైతే బాలీవుడ్‌ ప్రతిష్ఠ మరింత పెరుగడం ఖాయం.

ఇంతియాజ్ చిత్రంతో షారుక్ బిజిబిజీ

ఇంతియాజ్ చిత్రంతో షారుక్ బిజిబిజీ

దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో షారుక్ ఖాన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కింగ్ ఖాన్ సరసన అందాల తార అనుష్క శర్మ నటిస్తున్నది. పంజాబ్‌లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ వీరిద్దరూ పాల్గొన్న ఫొటోలు మీడియాలో కనిపించాయి. ఈ చిత్రానికి ది రింగ్ లేదా రెహ్నూమా అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 11 తేదీన విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది.

 ఫొటోలు షేర్ చేసిన షారుక్..

ఫొటోలు షేర్ చేసిన షారుక్..

షారుక్, అనుష్క శర్మ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను బాద్షా సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూరప్‌లో ఉండే షారుక్ పంజాబ్ టూరిస్ట్ గైడ్ పాత్రను, యూరప్‌ సందర్శనకు వెళ్లిన గుజరాతీ యువతి పాత్రను అనుష్క శర్మ ఈ సినిమాలో పోషిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ యూరప్‌లో ప్రేమ పడటం ఈ చిత్ర కథ.

 షారుక్‌కు హాలీవుడ్‌లో సత్కారం

షారుక్‌కు హాలీవుడ్‌లో సత్కారం

ఇటీవల అమెరికాలో షారుక్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్యాస్ట్రో థియేటర్‌లో ఏప్రిల్ 14న జరిగే 60వ శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో షారుక్‌ను సన్మానించనున్నారు. ఈ విషయాన్ని షారుక్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ ఫెస్టివల్ ఏప్రిల్ 5 నుంచి 19వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ వేడుకలో దాదాపు 200 చిత్రాలను ప్రదర్శించనున్నారు.

English summary
The production house behind the upcoming Batman movies starring Ben Affleck, has reportedly replaced Affleck with Indian actor Shah Rukh Khan, who has signed a three deal contract and will replace Batman. Furthur this report revealed that Happy April Fool’s Day, King Khan’s fans will have to wait . While there are rumours that Affleck may not play Batman, he has not been replaced by Shah Rukh Khan yet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu