హిందీ ‘మగధీర’ కి హీరో ఖరారు

By Srikanya

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం మగధీర. ఈ సినిమా హిందీ రీమేక్ కి హీరో దొరికాడని బాలీవుడ్ సమాచారం. ప్రచారంలో ఉన్న షాహిద్ కపూర్ నటించనున్నాడనే వార్త నిజమని తేలింది. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ కూడా ‘మగధీర సినిమా చూసాను, నాకు చాలా బాగా నచ్చిందని' అన్నాడు. కానీ తను ఈ సినిమా చేయనున్నట్లు మాత్రం ఖరారు చేయలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం బట్టి హీరోగా అతన్నే ఖరారు చేసారని తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ తో కిక్ తీసిన సాజిద్ నదియావాలా మగధీర రీమేక్ రైట్స్ ని కొనుకున్నాడు. అలాగే సాజిద్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్లు వినికిడి. టాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన మగధీర హిందీలో రిమేక్ అయితే ఆ రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి..

రీసెంట్ గా ‘హైదర్‌' సినిమా చేసిన షాహిద్‌ కపూర్‌ ఈ క్రేజీ సినిమా ఆఫర్‌ను సంపాదించాడు. రామ్‌చరణ్‌, కాజల్‌ అగర్వాల్‌ జోడీతో రాజమౌళి రూపొందించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘మగధీర' హిందీ రీమేక్‌లో హీరో పాత్ర అతడిని వరించినట్లు సమాచారం. ఇటీవలే బ్లాక్‌బస్టర్‌ హిందీ మూవీ ‘కిక్‌'తో డైరెక్టర్‌గా మారిన సాజిద్‌ నదియడ్‌వాలా ఈ రీమేక్‌ హక్కులను పొందాడు.

Shahid confirmed in Magadheera Remake

తాను గత జన్మలో ఓ యువరాణి ప్రేమను చూరగొన్న వీరయోధుడినని తెలుసుకునే ఓ స్టంట్‌-బైకర్‌ కథతో రూపొందిన ‘మగధీర' తెలుగులో బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆ పాత్ర హిందీలో షాహిద్‌ను వరించింది. కాగా ‘హైదర్‌' తర్వాత ‘షాందార్‌' సినిమాని చేయడానికి ఇప్పటికే అతను సంతకం చేశాడు. బహుశా దాని తర్వాత అతను ‘మగధీర' రీమేక్‌ను చేసే అవకాశాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X