రాజమౌళి 'ఈగ' లో షాహిద్ కపూర్
రాజమౌళి తాజా క్రేజీ ప్రాజెక్టు 'ఈగ' లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ప్రవేశించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అది హిందీ వెర్షన్ కని చెప్తున్నారు. ఇన్నాళ్ళూ కేవలం తెలుగు, తమిళ వెర్షన్స్ కి మాత్రమే అనుకున్న ఈ చిత్రాన్ని హిందీ,కన్నడ భాషలకు కూడా విస్తరించే పనిలో ఉన్నారు. కన్నడ కి నాని ప్లేసులో ఈగలో విలన్ గా చేస్తున్న సుదీప్ ని హీరో చేస్తున్నారు. అక్కడ మరో విలన్ ని తీసుకోనున్నారు. అలాగే హిందీకి షాహిద్ కపూర్ ని హీరోగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి కారణం హీరో పాత్ర తక్కువగా ఉండటమేనని తెలుస్తోంది. హీరో సినిమా ప్రారంభంలోనే చనిపోవటం..తర్వాత ఈగ రూపంలో పగ తీర్చుకోనుండటంతో..హీరో తెరపై విజువల్ గా కనపడేది తక్కువ..కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకోసం చర్చలు జరుగుతన్నాయి. ఇక కన్నడ,హిందీ రైట్స్ ని అశోక్ కోనే అనే ఆయన తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











