పుకార్లకు ఆలవాలమైన బాలివుడ్ లో ఇప్పడు సానియా మీర్జా, షాహిద్ కపూర్ల మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. వాళ్ళిద్ధూ బెంగుళూరులోని ఓ స్టార్ హోటలు దగ్గర చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ మాటల్లో పడ్డారట. అది అక్కడ మీడియా కళ్ల పడిందిట. దాంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు కామెంట్లు పాస్ చేస్తూ కాలం పాస్ చేస్తున్నారుట. అయినా బాలీవుడ్ లో పాపులర్ అయి విడిపోయిన జంటలుఎవరి దారి వారు చూసుకోవటం కామన్. అలాగే షాహిద్ కపూర్, కరీనా కపూర్ విడిపోయిన తర్వాత కరీనా సైఫ్ ఆలిఖాన్ తో సెటిల్ అయ్యింది.దాంతో షాహిద్ కపూర్ కొంత కాలం 'అతిథి' హీరోయిన్ అమృతారావ్ తో పిచ్చాపాటి కాలక్షేపం పెట్టినా కలిసిరాలేదు. ఒంటిరి గా మిగిలాడు. దాంతో అతను ట్రై చేస్తున్నాడో లేదో గాని ఎవరితో కనపడ్డా వాళ్లతో ముడి పెట్టడానికి బాలీవుడ్ పత్రికల వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సానియాతో ఎఫైర్ అంటూ చేస్తున్న ప్రచారం పత్రికల వాళ్లకి ఎంత మేరకు కలిసి వచ్చిందో గాని షాహిద్ సానియా ఇద్దరూ మాత్రం ఈ పుకార్లను ఎంజాయ్ చేస్తున్నారట.ఎవరి గోల వారిది.