షారుక్ ఖాన్...నాతో నటిస్తావా...??
గజినీ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్ గా నటించిన ఆసిన్ ను తన తదుపరి చిత్రంలో నటించాల్సిందిగా షారుక్ ఖాన్ అడిగితే ఆమె అందుకు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో చిర్రెత్తిన షారుక్ అసిన్ పేరెత్తితే కారాలు నూరుతున్నాడట. ఆమెకు పోటిగా తమిళంలో నటిస్తున్న ఓ అందాల తారను తన తదుపరి చిత్రంలో నటింపజేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారుని సమాచారం. ఇదిలా వుంటే ఇందులో భాగంగా షారుక్ తన బ్లాగులో తన సరసన నటించేందుకు ఆసక్తిగల తమిళ హీరోయిన్లు సంప్రదించగలరు అని బహిరంగంగా ప్రకటన ఇచ్చేశాడట.
షారుక్ సరసన తెల్లపిల్ల తమన్నా అయితే సూపర్ గా ఉంటుందని ఎవరో చెప్పారట. ఆ వార్త అలా అలా తమన్నా చెవికి చేరడంతో, ఆమె ప్రస్తుతం బాలీవుడ్ మేఘాలలో తేలిపోతోందట. కోలివుడ్ కోవాగా పేరు తెచ్చుకొన్న తమన్నా తన అందంతో శ్రియ, అసిన్ లను కోలీవుడ్ నుంచి తరిమికొట్టిందన్న వార్తలున్నాియ. ఈ నేపధ్యంలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తమకే ఎసరు పెడుతుందేమోనని శ్రియ, అసిన్, త్రిష ఆందోళన పడుతున్నట్టు బోగట్టా.


Click it and Unblock the Notifications











