Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘రా.వన్’పై దుష్ర్పచారాన్ని చేస్తూ షారుక్ ని హార్ట్ చేసిన మరో స్టార్ హీరో..?!
బాలీవుడ్ లో ఖాన్ల త్రయం మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? షారూక్ చిరకాల ప్రత్యర్థి సల్మాన్ ఖాన్ ఇప్పుడు అమీర్ తో చేతులు కలిపాడా?...అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 'రా.వన్" విడుదలతో సల్మాన్, అమీర్ ద్వయానికి, షారుఖ్ ఖాన్ మధ్య విబేధాలు మరింతగా పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలైన రా.వన్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని సాధించకపోవడంతో అమీర్, సల్మాన్ లు చాలా ఆనందంగా వున్నారని, ఇదే అదనుగా వీరిద్దరూ రా.వన్ సినిమాపై నెగటివ్ ప్రచారాన్ని చేస్తున్నారని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కొన్ని బాలీవుడ్ వర్గాలు అమీర్ ఖాన్ 'రా.వన్" చిత్రంపై దుష్ర్పచారాన్ని చేస్తున్నారనే విషయాన్ని బూచీగా చూపి షారుఖ్ ఖాన్ కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాయట. అయితే ఈ విషయాలన్నింటికీ మొదట లైట్ తీస్కున్నాడట షారూక్. రా.వన్ కలెక్షన్లపై అమీర్ ఖాన్ తరచుగా ఆరా తీస్తున్నాడని, ఆ చిత్రానికి సరైన కలెక్షన్లు లేవని అమీర్ ఖాన్ భావిస్తున్నాడని సన్నిహితులు చెప్పడంతో షారూక్ కొంత మనస్థాపానికి లోనయ్యాడట.
అయితే ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని అమీర్ సన్నిహితులంటున్నారు. 'అమీర్ ది ఒకరిపై జెలసీని ప్రదర్శించే బలహీన వ్యక్తిత్వం కాదు. రా.వన్ కలెక్షన్ల గురించి అమీర్ ఎందుకు ఆరా తీస్తాడు. ప్రస్తుతం ఆయన లండన్ లో షూటింగ్ లో బిజీగా వున్నారు. రా.వన్ సినిమా కలెక్షన్ల గురించి ఆయనకేమీ తెలియదు" అని వారంటున్నారు. ట్రేడ్ విశ్లేషకులు కూడా అమీర్ ఖాన్ 'త్రి ఇడియట్స్" కలెక్షన్లలో ఆల్టైమ్ రికార్డ్ సాధించిందని, రా.వన్ చిత్రం ఏ విషయంలోనూ 'త్రీ ఇడియట్స్" చిత్రానికి పోటీ రాదని అంటున్నారు. అమీర్, షారూక్ మధ్య వైరాన్ని సృష్టించడానికి కొందరు చేస్తున్న ప్రయత్నమిదని వారు కొట్టి పారేస్తున్నారు.