బహిరంగ ముద్దుతో వారి ‘సం’బంధం లీకైందా?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఇటీవల 18వ కలర్స్ స్క్రీన్ అవార్డ్స్ ఫంక్షన్లో సెక్సీ లేడీ కత్రినాను సడన్ గా ముద్దు పెట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో లిప్ టు లిప్ ముద్దు పెట్టుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ ఫంక్షన్లో కత్రినా చెంప మీద కింగ్ ఖాన్ ముద్దు పెట్టినందుకే బాలీవుడ్ లో ఇప్పుడిదో పెద్ద హాట్ టాపిక్ అయింది. సారుఖ్ చర్యను కత్రినా ప్రతిఘటించక పోవడం, ఆ ముద్దును హాయిగా ఆస్వాదించడం ఇందుకు కారణం అయి ఉండొచ్చు.
ఈ ముద్దుపై షారుఖ్ స్పందిస్తూ...జస్ట్ ఫన్ కోసమే అలా చేశాను. అంతకు మించి ఆ ముద్దు గురించి మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు అంటూ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు. అయితే కత్రినా వాదన మాత్రం మరోలా ఉంది. అది స్నేహ పూర్వకంగా ఇచ్చిన ముద్దే అయినా...ఆ ముద్దులో ఏదో గమ్మత్తు ఉంది. షారుఖ్ ముద్దు ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది అంటూ స్పందించింది.
షారుఖ్ చెప్పినట్లే కత్రినా కూడా చెప్పి ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదుకానీ...ఇద్దరూ వేర్వేరుగా స్పందిస్తుండటంతో ఇద్దరి మధ్య 'సం'బంధం ఉందనే వార్తలు షికారు చేస్తున్నాయి. వీరి మధ్య ఎఫైర్ ఎప్పటి నుంచో ఉందని, ఈ ముద్దుతో ఆ విషయం లీకైందని మరికొందరంటున్నారు. అయితే కత్రినా మాజీ ప్రియుడు సల్మాన్ కు షాక్ ఇవ్వడానికే షారుఖ్ ఇలా చేశాడని మరికొందరు అంటున్నారు.


Click it and Unblock the Notifications











