Shah Rukh Khan Jawan షాకింగ్ రెమ్యూనరేషన్స్... నయన్, విజయ్ సేతుపతి కంటే ఆమెకే ఎక్కువ?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం జవాన్. ఇక ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తుండగా.. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పఠాన్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత షారుఖ్ నటిస్తున్న చిత్రం కావడంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జవాన్ మూవీలో నటించిన స్టార్స్ రెమ్యూనరేషన్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం జవాన్. ఇక ఈ మూవీకి తమళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేయగా... ఈ సినిమాలో నయనతార, దీపికా పదుకునే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కు విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురువారం సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర రెమ్యూనరేషన్స్ బయటకు వచ్చాయి.

లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాకు భారీగానే తీసుకుంటుంది. మొదటిసారిగా బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న ఈ భామ... ఏకంగా రూ.11 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక విలన్ గా నటిస్తున్న విజయ్ సేతుపతి కూడా భారీగానే తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం అతను రూ. 21కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ మధ్యే బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లో విజయ్ సేతపతి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన ఫర్జీ వెబ్ సిరీస్ సూపర్ హిట్టుగా నిలిచింది.
ఇక జవాన్ సినిమాలో గెస్టురోల్ చేస్తున్న దీపికా పదుకోన్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. దీపికా పదుకోన్ ఏకంగా రూ.15 నుంచి 30 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ నయన్ కంటే ఈమెకే ఎక్కువగా ఉంది. మరో సౌతిండియా నటి ప్రియమణి కూడా ఈ సినిమాలో నటించగా.. ఈమె రూ.2 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ.. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. ఈ సినిమా పఠాన్ కంటే ఎక్కువ కలెక్ట్ చేయబోతుందని ట్రెడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను కలెక్ట్ చేయబోతుందని అంటున్నారు.

జవాన్ మూవీ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.125 కోట్లు కలెక్ట్ చేయనుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో 85 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీనితో షారుఖ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజులో కలెక్షన్స్ వసూలు చేయనుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











