పవన్‌లా ఆరడుగుల బుల్లెట్ అనిపించుకోవాలని..!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే పెద్ద హిట్ అయిన చిత్రంగా, భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలోని ఆరడుగుల బుల్లెట్ పాట మాదిరిగానే సినిమా కూడా విజయం దిశగా దూసుకెళ్లింది.
తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా చూసిన తర్వాత షారుక్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవలే త్రివిక్రమ్‌ను ముంబై పిలిపించుకుని స్టోరీ నేరేట్ చేయించుకున్నట్లు టాక్.

కాగా...‘అత్తారింటికి దారేది' చిత్రానికి తెలుగులో సహ నిర్మాతగా వ్యవహరించిన రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి సంస్థ....హిందీలో ఈచిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదేమీ షారుక్ ఖాన్‌కు తొలి తెలుగు రీమేక్ కాదు, గతంలో తెలుగులో వచ్చిన ‘అంత:పురం' చిత్ర హిందీ రీమేక్ ‘శక్తి'లో నటించారు.
ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌తో బాలీవుడ్‌ను బాద్ షాలా ఏలిన షారుక్ ....ప్రస్తుతం వయసుకు తగిన పాత్రలు ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందులో భాగంగానే షారుక్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారంటికి దారేది' చిత్రం హిందీ రీమేక్‌పై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ హిందీ మూవీ ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఫరా ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఆడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











