రామ్ చరణ్ కోసం బాలీవుడ్ బాద్​ షా.. గేమ్ ఛేంజర్ భారీ ప్లాన్ !

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథ నాయకుడుగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. వేంకటేశ్వర బ్యానర్​ పై దిల్ రాజు భారీ బడ్జెట్​ తో నిర్మిస్తున్నారు. RRR లాంటి భారీ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ ఓ వైపు శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్స్ తో నెట్టింట్లో సందడి చేసోంది. ఈ తరుణంలో గేమ్​ ఛేంజర్​ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

గేమ్ ఛేంజర్ మూవీలో గ్లోబల్ స్టార్ రాంచరణ్, అందాల భామ కియారా అద్వానీ జంటగా నటిస్తుండగా.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్ నుండి ఐఏఎస్ ఆఫీసర్ గా మారిన వ్యక్తిగా.. ఓ రైతు నుండి నాయకుడిగా మారిన మరో పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Shahrukh Khan will attend as special guest for Ram Charan s Game Changer movie pre release event

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా అప్డేట్స్ కు మెగా ఫ్యాన్స్ నుంచి కేజ్రీ రెస్పాన్ వస్తుంది. ఇటీవల ఈ మూవీ నుండి విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. సాధారణంగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమా టేకింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. తన మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తారు శంకర్. ఇటీవల కమల్ హాసన్ తో తెరకెక్కించిన భారతీయుడు 2 మూవీ డిజాస్టర్ గా నిలవడంతో.. ఈ మూవీపై మరింత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

గేమ్ చేంజర్ ప్రమోషన్ లో భాగంగా ఆడియో రిలీజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లను హై రేంజ్ లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్ హాలీవుడ్ స్టార్లను ఆహ్వానించాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే. . ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట.

Shahrukh Khan will attend as special guest for Ram Charan s Game Changer movie pre release event

షారుక్ ఖాన వస్తే.. పబ్లిసిటీ పెరుగుతుందని, మూవీ ప్రమోషన్స్ కు మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అలాగే బాలీవుడ్ మీడియా కూడా ఈ ఈవెంట్ పై ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను ఇన్వైట్ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రమోషనల్ ఈవెంట్స్​ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే.. అయితే ఇదొక ఈ వార్తలో నిజమైందో అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే.

ఇదిలా ఉంటే.. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ అమెజాన్ ప్రైమ్, జీ స్టూడియో కొనుగోలు చేసింది. అందుకు రూ.160 కోట్లు వెచ్చించి డిజిట‌ల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X