ఒక్క డైరెక్టర్ కోసం ఫైట్ చేసుకొన్న ఇద్దరు స్టార్ హీరోలు...!

By Sindhu

ఒకే దర్శకుడి కోసం ఇప్పుడిద్దరు హీరోలు పోటీపడుతున్నారు. పైగా వాళ్లిద్దరూ మామూలు హీరోలు కూడా కాదు... ఒకరు షారుఖ్ ఖాన్ అయితే, మరొకరు సల్మాన్ ఖాన్. ఆ దర్శకుడేమో ఎ.ఆర్.మురుగదాస్..! ఆమధ్య హిందీలో అమీర్ ఖాన్ తో కలిసి బిగ్గెస్ట్ హిట్ ఫిలిం 'గజనీ' ని రూపొందించిన మురుగదాస్, తన తదుపరి హిందీ చిత్రం కోసమే ఈ హీరోలిద్దరూ ఇప్పుడు పోటీపడేది.

షారుఖ్ ఖాన్ తో తన తదుపరి చిత్రాన్ని మురుగదాస్ రూపొందించనున్నాడని గత కొంత కాలంగా వార్తలొస్తున్నప్పటికీ, తాజాగా సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో సినిమా రూపొందించడానికి ఓ ప్రముఖ నిర్మాత దాస్ ని కాంటాక్ట్ చేశాడు. దాస్ కూడా సల్మాన్ తో చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షారూఖ్ కూడా దాస్ ని సంప్రదిస్తున్నాడనీ, ఇటీవల వీరిద్దరూ కూడా కొన్నిసార్లు కలిశారని అంటున్నారు. ఏమైనా, ఏ 'ఖాన్' తో ఈ దాస్ తన తదుపరి సినిమా తీస్తాడన్నది ఆసక్తికరంగానే వుంది..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X