షారుక్ ఖాన్‌తో స్క్రీన్ పంచుకోనున్న రామ్ చరణ్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌తో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నాడు. రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న 'జంజీర్' చిత్రంలో షారుక్ గెస్ట్‌గా కానీ, స్పెషల్ సాంగులో కానీ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
మరో వైపు ఈచిత్రంలో చెర్రీకి విలన్ పాత్రలో సంజయ్ దత్ ఖరారైన సంగతి తెలిసిందే. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంయుక్తంగా అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. అపూర్వ లఖియా దర్శకత్వం.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. అదే చిత్రాన్ని ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.
మరో వైపు రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' చిత్రంలో నటిస్తున్నారు. చివరగా రచ్చ చిత్రంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రచ్చ సృష్టించిన రామ్ చరణ్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











