మగాళ్లపై పైన కసితో షకీలా ఈ నిర్ణయం
హైదరాబాద్ : వయసైపోయి నటనా జీవితం నుంచి దాదాపు రిటైరైపోయిన స్టేజీలో ఉన్న షకీలా ...దర్శకురాలిగా అవతారమెత్తింది. తన డైరక్ట్ చేయబోయే చిత్రంలో మృగాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలి, వారి ఆగడాలను ఏ విధంగా అడ్డుకోవాలనే అనే విషయానికి ప్రయారిటీ ఇస్తూ రూపొందించిందిట. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం గురించి తెలిసిన వారు...మగాళ్లతో విసిగిపోయిన షకీలా వారిపై కసితో..ఇలాంటి కాన్సెప్టు ఎన్నుకుందని అంటున్నారు.
నేటి సమాజంలో మహిళలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి. వీటిని అడ్డుకోవడానికి ఏం చేయాలి..? ఆ మృగాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలి? ఇలాంటి ప్రశ్నలకు మా సినిమా కచ్చితమైన సమాధానమిస్తుంది అంటున్నారు షకీలా. ఆమె దర్శకురాలిగా మారి తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో నరేష్, శ్వేత జంటగా నటించారు. హిందీలో భూషణ్, శ్వేత హీరో,హీరోయిన్స్. మెంటా సత్యనారాయణ నిర్మాత.

నిర్మాత మాట్లాడుతూ... ''ప్రస్తుతం సమాజంలో కొరగాని సమస్యగా మారిన అంశంపై షకీలా చెప్పే సమాధానమిది. ఇందులో ఆమె ఓ పాత్ర కూడా పోషిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళంలోకి అనువదిస్తాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు నిర్మాత.
సెక్స్ చిత్రాలతో ఒప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన షకీలా ఆ తర్వాత ఆ... సినిమాలకు స్విస్తి చెప్పింది. సెక్స్ తార ఇమేజ్ పొగొట్టుకోవడానికి చాలా ట్రైచేసింది. మామూలు సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. షకీలా లాంటి సెక్సీ లేడీని మామూలు పాత్రల్లో చూడటానికి ఎవరూ మాత్రం ఇష్ట పడతారు చెప్పండి. షకీలాపై ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన పలువురు దర్శకులు.... మరీ బూతు పాత్రలు కాకుండా శృంగారం టచ్ ఉన్న పాత్రలు, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన సన్నివేశాలు ప్లాన్ చేసేవారు. కొన్ని సినిమాల్లో ఇవి బాగానే వర్కౌట్ అయ్యాయి కూడా. మరి దర్శకురాలిగా కెరీర్ మొదలు పెట్టబోతున్న షకీలా ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











