‘శక్తి’ దెబ్బకు ఇలియానా పరిస్ధితి ఘోరం
'శక్తి" సినిమా క్రియేట్ అయిన హైప్ తో ఇలియానా ఆ సినిమా విడుదలకి కొద్ది రోజుల ముందు భారీ రెమ్యునరేషన్‌తో రెండు మూడు సినిమాలు సైన్ చేసింది. ఈ సమయంలో ఓ చిత్రం కోసం ఇలియానా కోటిన్నర డిమాండ్ చేసిందనీ, నిర్మాత అందుకు ఓకే చెప్పాడనీ ప్రచారం జరిగింది.ఇక క్రితం వారం 'శక్తి" సినిమా విడుదలయై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాక ఇలియానా పేరే ఎక్కడా వినిపించడం లేదు. షూటింగ్ దశలో వున్నవి, విడుదలకు సిద్ధంగా వున్నవి మినహా ఇలియానా కొత్తగా సైన్‌చేసిన ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ అయిపోయాయని ఫిల్మ్ నగర్ టాక్.ఇప్పుడు కావాలంటే ఇలియానా 50లక్షలకు కూడా సినిమా చేసే స్థితిలో వుందని అంటున్నారు.'ఖతర్నాక్" సినిమా కన్నా ఇలియానా కెరీర్‌ను 'శక్తి"పూర్తిగా నాశనం చేసిన చిత్రం ఇదే అంటున్నారు.ఆమె కోలుకోవాలి అంటే షూటింగ్ లో ఉన్న చిత్రం రిలీజై హిట్టవ్వాలి అంటున్నారు. అయితే ఇలియానా మాత్రం ఫ్లాప్‌లు నన్నేం చేయలేవు. ఒకవేళ అవి ఎదురైతే... వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. రెండుమూడు ఫ్లాపులకే కరిగిపోయే ఇమేజ్ కాదు నాది.కిక్ కి ముందు ఇలియానా పనైపోయిందని చాలామంది అన్నారు.తర్వాత ఏమైందో మీకు తెలుసు అంటూ ఛాలెంజ్ లు విసురుతోంది. ప్రస్తుతం ఇలియానా.. రాణాతో నేనూ నా రాక్షసి, పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా, మహేష్ బాబుతో మరో సినిమా, ప్రభాస్ తో ఓ సినిమా చేస్తోంది. రెమ్యునేషన్ కూడా పెంచిన ఈ భామ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్వరలో బాలీవుడ్ లో కూడా ప్రవేశించి హిట్స్ కొడతానని నమ్మకంగా చెప్తోంది.


Click it and Unblock the Notifications











