జూ ఎన్టీఆర్ 'శక్తి'చిత్రం టాక్ ఏమిటి?
జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి ఈ రోజు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం టాక్ రకరకాలుగా ఉంది.మాకు అందిన సమాచారం ప్రకారం ఫస్టాఫ్ లో వచ్చే శక్తి పాత్ర చేసే ఫైట్స్, ఎడ్వెంచర్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.ఇలియానాను రక్షించే క్రమంలో అతను కనపరిచే వేగం,నేర్పు బాగున్నాయి. అయితే సెకెండాఫ్ లో వచ్చే రుద్ర ఎపిసోడ్స్ బాగా స్లోగా సాగాయి. దాదాపు అరగంట సేపు వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరింత బాగా వర్కవుట్ చేయ్యాల్సింది అంటున్నారు.ఇక ఎన్టీఆర్ బలం అయిన పాటల్లో చెలరేగిపోయాడంటున్నారు. నాలుగు పాటలు చాలా బాగున్నాయి.ఆడియో డల్ గా ఉన్నా తెరపై పేలాయి అంటున్నారు.అయితే సినిమాని నిలబెట్టే కామిడీ మాత్రం అస్సలు పండలేదని చెప్తున్నారు.మొత్తం మీద సినిమా ఊహించనంత గొప్పగా లేదని అంటున్నారు. యావరేజ్ రిపోర్టు చెప్తున్నారు. కొందరేమో ఫైవ్ వీక్స్ అని చెప్తున్నారు.అయితే ఇదే కరెక్టు అని ఫిక్సవ్వాల్సిన పనిలేదు.ఇది కేవలం ప్రి రిలీజ్ రిపోర్టు మాత్రమే.


Click it and Unblock the Notifications











