అప్పుడు పోకిరి ఇప్పుడు మగధీర తో దెబ్బైపోయాడు జూ ఎన్టీఆర్!
జూ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ అనే దానికి ప్రత్యేకించి ఎలాంటి ఇంట్రో అక్కర్లేదు. బాక్సాఫీస్ ని శాసించే స్థాయికి ఎదిగిన ఎన్టీఆర్ ఎందుకనో ఇంతదాకా భారీ బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయాడు. సింహాద్రి, యమదొంగ సినిమాలు సూపర్ హిట్ అయినా అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ హిట్ సినిమాల రికార్డులని అధిగమించలేకపోయాయి. ఈ వెలితి జూ ఎన్టీఆర్ ని పీడిస్తున్నట్టే ఉంది. లేదంటే 'పోకిరి" రికార్డుని కొట్టాలనే తపనతో 'కంత్రి"చేసి ఉండేవాడు కాదు. పోకిరి లాంటి కథ కావాలని ఎన్టీఆర్ ఎదురు చూస్తున్న రోజుల్లో మెహర్ రమేష్ కంత్ర క్యారెక్టర్, కథ పట్టుకెళ్ళి జూ ఎన్టీఆర్ ని పడగొట్టాడు.
అయితే ఆ సినిమాకి ఆడియన్స్ మాత్రం పడిపోలేదు. మగధీర చూసిన తరవ్ాత ఎలాగైనా అలాంటి సినిమా చేయాలని ఎన్టీఆర్ కోరుకుంటాడని తెలిసిన మెహర్ రమేష్ శక్తి స్టోరితో వెళ్లి అతని వీక్ నెస్ మీద దెబ్బకొట్టాడు. మరోసారి మెహర్ చెప్పిన కథకి పడిపోయిన ఎన్టీఆర్ 'మగధీర"తో వాత పెట్టుకున్నాడనే అర్థమవుతోంది. మగధీర కథనే అటు చేసి, ఇటు చేసి మెహర్ రూపొందించిన శక్తి కిచిడీలా తయారైందని, మగధీర ముందు పూర్ కార్బన్ కాపీలా వెలవెలబోయిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్ ఇలా చేసుండకూడదనే టాక్ వినిపిపోస్తోంది.


Click it and Unblock the Notifications











