నయన మాజీతో షామిలీ

ఇక యూనివర్శల్ మీడియా బ్యానర్ పై ఓయ్ టైటిల్ తో దానయ్య నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా ఆనంద్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. షామిలి హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తోంది. మణిరత్నం 'అంజలి' చిత్రంలో జుట్టు విరబోసుకుని ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకునే బేబి షామిలీ ఈ చిత్రంతోనే హీరోయిన్ గా ప్రమోషన్ పొందుతోంది. "ఓయ్" చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు..విశాఖకు 20 కి.మీలలో గల రుషి కొండలో 20 లక్షల సెట్ వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పొయిటిక్ టచ్ తో నడిచే కథనంతో సెంటిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. రెండు పాటలు, పదిరోజులు టాకీ పార్టీ మినహా సినిమా పూర్తయ్యింది. అలాగే ఈ చిత్రానికి ఊహించని క్లైమాక్స్ ఉంటుందని, అది ధియోటర్ నుంచి బయిటకు వచ్చినా వెంబడిస్తుందని దర్శక, నిర్మాతలు ధీమాగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











