twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయన మాజీతో షామిలీ

    By Staff
    |

    Shamili
    నయనతార, శింబు లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. ఇద్దరూ విడిపోయి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు తమకు నచ్చిన వాళ్ళకు దగ్గరవుతున్నారు. ఆ క్రమంలో శింబు ప్రస్తుతం బేబి షామిలి కి దగ్గరతున్నాడని సమాచారం. అలాగే ఆమె కూడా శింబు అంటే విపరీతమైన ఆసక్తి చూపుతోందని సమాచారం. ప్రస్తుతం సిద్దార్ధతో ఓయ్ చిత్రంలో చేస్తున్న ఆమె షూటింగ్ గ్యాప్ లో గంటలు తరబడి శింబుతో కాంటాక్ట్ లో ఉంటోంది. అతని రఫ్ నెస్, రగ్గడ్ గా ఉండే తీరు తనకి నచ్చుతాయని ఆమె బహిరంగంగానే చెప్తోంది. అలాగే శింబు సినిమాలు రాత్రి చూడందే నిద్రపోదు. మొదట ఓ అభిమానిగా మొదలైన ఈ ప్రయాణం లవర్ గా మారుతుందని అనుకోలేదని ఆమె శ్రేయాభిలాషులు అంటున్నారు. అయితే శింబు మాత్రం ఈ విషయమై స్పందించటం లేదు.

    ఇక యూనివర్శల్ మీడియా బ్యానర్ పై ఓయ్ టైటిల్ తో దానయ్య నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా ఆనంద్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. షామిలి హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తోంది. మణిరత్నం 'అంజలి' చిత్రంలో జుట్టు విరబోసుకుని ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకునే బేబి షామిలీ ఈ చిత్రంతోనే హీరోయిన్ గా ప్రమోషన్ పొందుతోంది. "ఓయ్" చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు..విశాఖకు 20 కి.మీలలో గల రుషి కొండలో 20 లక్షల సెట్‌ వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పొయిటిక్ టచ్ తో నడిచే కథనంతో సెంటిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. రెండు పాటలు, పదిరోజులు టాకీ పార్టీ మినహా సినిమా పూర్తయ్యింది. అలాగే ఈ చిత్రానికి ఊహించని క్లైమాక్స్ ఉంటుందని, అది ధియోటర్ నుంచి బయిటకు వచ్చినా వెంబడిస్తుందని దర్శక, నిర్మాతలు ధీమాగా ఉన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X