శంకర్ మరో డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తి కాకముందే శంకర్ భవిష్యత్తు ప్రాజెక్టులపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ ఎప్పుడు ఎక్కడ మొదలవుతాయో గాని సౌత్ ఇండస్ట్రీలో మాత్రం వైరల్ గా మారాయి. మొన్న పవర్ స్టార్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడని శంకర్ ఆ కాంబోను డైరెక్ట్ చేయనున్నట్లు కథనాలు వచ్చాయి.

నిజానికి లాక్ డౌన్ లోనే కొన్ని కథలను సెట్ చేసుకున్న డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఒక స్టోరీ సెట్టయినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైనట్లు టాక్ వచ్చింది. అయితే అది మర్చిపోయో లోపే KGF హీరో యష్ తో సినిమా చేయబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

Shankar another pan indian movie with yash

హిస్టారికల్ నేపథ్యంలో రాసుకున్న కథను తెరకెక్కించడానికి నాలుగేళ్ళ వరకు కష్టపడనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని శంకర్ మాత్రం త్వరలోనే ఓ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ తో చేస్తున్న ఇండియన్ 2 సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమాలో కాజల్ ఆగర్వాల్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X