twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RC 15 నుంచి మరో ఇంట్రెస్టింగ్ లీక్.. భారీ అంచనాలు పెంచుతున్న వింటేజ్ శంకర్.. రచ్చ రచ్చే!

    |

    చిరుత సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్ తేజ.. అయితే అనూహ్యంగా ఆయన ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక సినిమాతో సూపర్ హిట్ అందుకొని మరో సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. హిట్ వచ్చిందని పొంగిపోలేదు, డిజాస్టర్ వచ్చిందని కుంగిపోలేదు ప్రస్తుతం అయిన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    చాలా గ్యాప్ తీసుకుని

    చాలా గ్యాప్ తీసుకుని


    రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని మరీ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ తో స్క్రీన్ పంచుకున్న ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత తన తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు. తండ్రీ తనయుల కాంబో సూపర్ హిట్ అవుతుంది అనుకునే డిజాస్టర్ అయింది.

    బీచ్ పరిసర ప్రాంతాల్లో

    బీచ్ పరిసర ప్రాంతాల్లో


    అయితే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, జయదేవ్, అంజలి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం బీచ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో అనేక సార్లు రామ్ చరణ్ ఫోటోలు బయటకు రావడం, ఆ ఫోటోలన్నీ వేరు వేరు గెటప్ లో కనిపించడం ఆసక్తికరంగా మారింది.

    ముఖ్యమంత్రి ఎలా అవుతాడు?

    ముఖ్యమంత్రి ఎలా అవుతాడు?


    అయితే రామ్ చరణ్ ద్విపాత్రాభినయం లేదా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు అనే వాదన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ ఆ విషయం మీద మాత్రం ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఐఎఎస్ అధికారి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.

     అపరిచితుడు

    అపరిచితుడు


    ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని, అయితే సిస్టమ్‌లోని అవినీతి కారణంగా, సిస్టమ్‌ని సరిగ్గా సెట్ చేయడానికి అప్రమత్తమై ఒకానొక సమయంలో శంకర్ తెరకెక్కించిన భారతీయుడు, అపరిచితుడు లాగా మరో పాత్రలో పరకాయ ప్రవేశం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

    పాన్ ఇండియా రేంజ్ లో

    పాన్ ఇండియా రేంజ్ లో


    ఇండియన్ 2 సినిమా మొదలు పెట్టి అనేక అవాంతరాలు ఎదుర్కొన్న తర్వాత, శంకర్ ప్రస్తుతానికి RC15 సినిమా ముందు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, సునీల్, శ్రీకాంత్ మరియు నవీన్ చంద్ర కూడా నటిస్తున్నారు. మెగా అభిమానులు సహా సౌత్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతోంది.

    English summary
    Shankar giving Aparichitudu Touch For Charan film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X