చరణ్ తర్వాత కూడా తెలుగు హీరోతో శంకర్ సినిమా.. ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇండియా మొత్తం మెచ్చిన దర్శకుడు శంకర్. స్వతహాగా తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఆయన రోబో, 2.0 సినిమాల ద్వారా భారతదేశం మొత్తం ఫేమస్ అయ్యాడు. చివరిగా 2.0 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తర్వాత కమల్ హాసన్ హీరోగా గతంలో భారతీయుడు సినిమాకి సీక్వెల్ భారతీయుడు 2 సినిమా ప్రారంభించారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో భారీ ప్రమాదం జరగడంతో యూనిట్ సభ్యులు కొంత మంది మరణించారు ఈ దెబ్బతో షూటింగ్ ఆపేశారు.. చాలా కాలం పాటు సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు అనేక ప్రయత్నాలు చేసిన శంకర్ అవి ఫలించకపోవడంతో రామ్ చరణ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశారు.

ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ కూడా పెద్ద ఎత్తున వైజాగ్ లో జరుగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్ వంటి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక నిజాయితీ కలిగిన అధికారి జీవిత కథ ఆధారంగా చేసుకుని ఇది సినిమా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ సంగతి అలా ఉంచితే మరోసారి శంకర్ తెలుగు హీరో తో మరో పాన్ ఇండియా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ హీరో మరెవరో కాదు రామ్ చరణ్ తో కలిసి RRR కోసం స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్. శంకర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఈ మేరకు ఎన్టీఆర్ కు ఒక కథ చెప్పడానికి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.

 Shankar planning his next movie with ntr

ఇక ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరే ఇతర వివరాలు కూడా బయటకు రాలేదు కానీ ఆయన ఎన్టీఆర్ కు కథ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడని వార్త మాత్రం ఫిలింనగర్ వర్గాల లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నిజానికి శంకర్ ఇప్పటికే అపరిచితుడు రీమేక్ కూడా హిందీలో అనౌన్స్ చేశాడు. రణవీర్ సింగ్ హీరోగా ఆ సినిమా హిందీలో చేయాల్సి ఉంది. రామ్ చరణ్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ కూడా బిజీ బిజీ షెడ్యూల్స్ తో ఉన్నారు. ఆయన కొరటాల శివతో సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా అనౌన్స్ చేశారు. అలా ఈ ఇద్దరు షెడ్యూల్ బిజీగా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఏమైనా కలిసి పనిచేసే అవకాశం ఉందేమో. ప్రస్తుతానికి మాత్రం కథ చెప్పి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X