శంకర్, రామ్ చరణ్ బడ్జెట్.. దిల్ రాజు ఆ స్థాయిలో ఖర్చు పెట్టగలడా?

మొత్తానికి ముందుగా ఉహించినట్లుగానే శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ సెట్టయ్యింది. ఈ కాంబినేషన్ పై మొదట్లో రూమర్స్ వచ్చినప్పుడు నమ్మడానికి కొంచెం కష్టంగానే అనిపించింది. అబద్ధమని మరికొన్ని కథనాలు కూడా వచ్చాయి. కానీ ఫైనల్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఆనందం మొదలైంది. ఇక సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు కూడా అనేక రకాల రూమర్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. మెయిన్ గా బడ్జెట్ పై ఒక గాసిప్ కూడా వైరల్ అవుతోంది.

 మొదటి సినిమా కోసమే భారీ బడ్జెట్

మొదటి సినిమా కోసమే భారీ బడ్జెట్

శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల అంచనాలను అందుకునేలా ఉండాలని భారీగా ఖర్చు చేస్తాడని అందరికి తెలిసిందే. మొదటి సినిమా జెంటిల్మెన్ కోసమే అప్పట్లో కోటి రూపాయలకు పైగా బడ్జెట్ పెట్టారు. సౌత్ ఇండస్ట్రీలో అప్పట్లో ఆ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే ఆ తరువాత శంకర్ బడ్జెట్ పెరుగుతూనే ఉంది గాని ఏ మాత్రం తగ్గడం లేదు.

ఆ రెండు సినిమాలతో తగ్గిన హవా

ఆ రెండు సినిమాలతో తగ్గిన హవా

వరుస విజయాలతో ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను పెంచుకుంటున్న వెళుతున్న శంకర్ కు ఒక్కసారిగా ఐ సినిమా కాస్త బ్రేక్ వేసినట్లు అనిపించింది. ఆ సినిమా నష్టపోలేదు గాని అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. ఇక 2పాయింట్ ఓ కోసం ఏకంగా 400కోట్లకు పైగా ఖర్చు చేయించారు అది అసలు వర్కౌట్ కాలేదు.

శంకర్ తో సినిమా అంటే..

శంకర్ తో సినిమా అంటే..

ఇక ఇండియన్ 2 సినిమాను సెట్స్ పైకి తెచ్చిన శంకర్ ఆ సినిమా బడ్జెట్ ను తన ప్లాన్ ప్రకారం హై బడ్జెట్ లో నిర్మించడం లేదు. నిర్మాతలతో ఇప్పటికే బడ్జెట్ విషయంలో చాలా సార్లు చర్చలు జరిగాయి. ఒక పాట కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేసి శంకర్ తో సినిమా చేయాలి అంటే ప్రొడక్షన్ హౌజ్ చాలా బలంగా ఉండాలి.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
బడ్జెట్ ఎంత ఉంటుందో..

బడ్జెట్ ఎంత ఉంటుందో..

అయితే ఇప్పుడు శంకర్ తో సినిమాను నిర్మించడానికి సిద్దమైన దిల్ రాజు ఎలా డీల్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకు 100కోట్ల బడ్జెట్ లో దిల్ రాజు సినిమాలు చేసింది లేదు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియక్ సినిమా అంటే ఆ బడ్జెట్ ఈజీగా 150కోట్లకు పైనే ఉంటుంది. అయితే ఆ స్థాయిలో బడ్జెట్ ను దిల్ రాజు తట్టుకోగలరా అనే టాపిక్ వైరల్ అవుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే ముందు సినిమా ఏ జానర్ లో డిజైన్ చేస్తారనేది తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X