శంకర్, రామ్ చరణ్ బడ్జెట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన అల్లు అర్జున్ హీరోయిన్?

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందనున్న శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . ఈ సినిమా కోసం అటు శంకర్ కోలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు ఇటు టాలీవుడ్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు ఒక రూమర్స్ గట్టిగానే వినిపిస్తోంది.

మొదట ఎవరు నమ్మలేదు..

మొదట ఎవరు నమ్మలేదు..

శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ పై ఇటీవల దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ పై మొదట్లో రూమర్స్ వచ్చినప్పుడు నమ్మడానికి కొంచెం కష్టంగానే అనిపించింది. అబద్దం అని కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ఫైనల్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఆనందం మొదలైంది.

భారీ బడ్జెట్ తో..

భారీ బడ్జెట్ తో..


ఇక సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు కూడా అనేక రకాల రూమర్స్ ఇంకా వస్తూనే ఉంటాయని అర్ధమయ్యింది. మెయిన్ గా బడ్జెట్ హీరోయిన్ విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల అంచనాలను అందుకునేలా ఉండాలని భారీగా ఖర్చు చేస్తాడని అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాను కూడా కాస్ట్లీగానే ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 150కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని సమాచారం.

రష్మిక మందన్న ఫిక్స్ అయినట్లే..

రష్మిక మందన్న ఫిక్స్ అయినట్లే..

ఇక సినిమాలో మెయిన్ హీరోయిన్ విషయంపై చర్చలు జరుగుతున్న క్రమంలోనే ఒక విషయం లీక్ అయ్యింది. సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ పెంచడం కాయం..

రెమ్యునరేషన్ పెంచడం కాయం..

నిజంగా రష్మిక మందన్న గనక రామ్ చరణ్ , శంకర్ ప్రాజెక్టులో ఫైనల్ అయినట్లు ఎనౌన్స్మెంట్ వస్తే ఒక్కసారిగా ఆమె రెమ్యునరేషన్ డోస్ పెరగడం కాయం. ఇటీవల ఆమె రెండుకోట్లకు పైగా పారితోషికాన్ని అందుకుంటోందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఇక రష్మిక రెండు పాన్ ఇండియా సినిమాలతో హిట్స్ కొడితే సౌత్ లో నెంబర్ స్థానంలో నిలవడం కాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X