విక్రమ్,శంకర్ ల 'ఐ' ఆ చైనీస్ సినిమా ప్రేరణతో..

By Srikanya

హైదరాబాద్: విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఐ'. ఆస్కార్‌ ఫిలిమ్స్‌ ప్రై.లి. సంస్థ పై భారీగా వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ చైనీస్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ రూమర్స్ ప్రకారం ఈ చిత్రం Running on Karma (2003)ఆనే చిత్రం ఆధారంగా రూపొందుతోంది. విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. విక్రమ్‌, అమీ జాక్సన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా వ్యవహరిస్తున్నారు.

చైనీస్ చిత్రం కథ ప్రకారం..హీరో ఓ బౌధ్ద సన్యాసి. అతనికి ఇతరుల జీవితాల్లోకి చూడగలిగే వరం ఉంటుంది. అతను ఓ లేడీ పోలీస్ అధికారికి పరిచయమవుతాడు. ఆమె ఓ క్రిమినల్ ని పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. ఆమెకు ఈ సన్యాసి తన శక్తులతో ఆ క్రిమినల్ ని పట్టుకోవటానికి సాయిం చేస్తాడు. అతను తన స్నేహితుడు మర్డర్ కి గురి అవటంతో తన ఆశ్రమం వదిలి బయిటకు వచ్చి ఆ కిల్లర్ ని పట్టుకోవాలని తిరుగుతున్నాడని ఆమెకు అర్దం అవుతుంది. అయితే ఆ పోలీస్ కూడా త్వరలో చనిపోవాలని రాసి పెట్టి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.

విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఏడేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'ఐ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు. త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశం తో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.

అలాగే రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కి టైటిల్ గా 'మనోహరుడు'ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. తమిళంలో 'ఐ' అనే పేరుని ఖరారు చేశారు. తెలుగులో 'మనోహరుడు' అనే పేరుని నిర్ణయించారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రంలో మలయాళ హీరో సురేష్‌ గోపి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X