కమల్ సలహాను పెడచెవిన పెట్టాడు.. చేతుల కాల్చుకొన్న శంకర్.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

ఇండియన్ సినిమా పరిశ్రమలో టెక్నాలజీని అద్భుతంగా వాడగల దర్శకుల్లో శంకర్ ఒకరు. 90వ దశకంలో అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఆయన అద్భుతాలు సృష్టించారు. జీన్స్ చిత్రంలోని ఒక పాటను ప్రపంచంలోని ఏడు వింతల వద్ద షూట్ చేస్తే సినీ జనాలు ముక్కున వేలేసుకున్నారు. అలాంటి ప్రయోగాలు, సాహసాలు శంకర్‌కు వెన్నతో పెట్టిన విద్య.

దక్షిణాదిలో తమిళ డబ్బింగ్ చిత్రాలకు ఊపు తెచ్చిన వ్యక్తి శంకర్. ఆయన సినిమాలు ఆయా భాషల్లో స్ట్రెయిట్ మూవీస్‌తో పోటీ పడి మరీ వసూళ్లు రాబట్టేవి. ఇన్నేళ్ల కెరీర్‌లో శంకర్ తీసినవి 14 సినిమాలేనా అంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ స్లో అండ్ స్టడీగా .. స్క్రిప్ట్ వర్క్ కోసం సమయాన్ని వెచ్చించి పక్కా ప్లానింగ్‌తో హిట్ కొట్టడం శంకర్ స్టైల్.

Shankar to trim to cut short 20 mins of Indian 2 after Kamal Haasan s advice

శంకర్‌ శైలిని అనుసరించాలని ట్రై చేసి ఎంతోమంది చేతులు కాల్చుకున్నారు.. బహుశా అది శంకర్‌కే సాధ్యమని వారంతా అంగీకరిస్తారు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన దర్శకులు రిటైర్‌మెంట్ ప్రకటించడమో లేదంటే, సినిమాలకు స్వస్తి చెప్పేయడమో జరుగుతోంది. కానీ శంకర్ మాత్రం మూడు దశాబ్ధాలుగా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

సక్సెస్ రేట్ విషయంలోనైనా, ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలోనైనా శంకర్ ఇప్పటికీ ముందుంటారు. కానీ తాజాగా రిలీజైన ఇండియన్ 2 విషయంలో ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో కమల్ హసన్ ఇచ్చిన సలహాలను పక్కన పెట్టారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

Shankar to trim to cut short 20 mins of Indian 2 after Kamal Haasan s advice

ఇండియన్ 2 సినిమా అనేక వాయిదాల మధ్య ఎట్టకేలకు జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సాధారణంగా తన సినిమాలు డబ్బింగ్ పూర్తి అయిన తర్వాత తన సినిమాలను చూసే అలవాటు ఉంది. అయితే ఇండియన్ 2 సినిమా చూసిన తర్వాత 30 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివి తగ్గించాలని శంకర్‌కు సూచించారట. అయితే శంకర్ అందుకు నిరాకరించడంతో 3 గంటల నిడివితో సినిమాను రిలీజ్ చేశారు.

థియేట్రికల్‌గా రిలీజైన తర్వాత ఇండియన్ 2 సినిమాపై ప్రేక్షకులు పెదవి విరిచారు. ప్రధానంగా నిడివి పై అనేక మంది అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ సినిమాపై వచ్చిన ఫీడ్‌బ్యాక్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను 20 నిమిషాల లెంగ్త్‌ను తగ్గించేందుకు శంకర్ నిర్ణయం తీసుకొన్నారనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

More from Filmibeat

Read more about: shankar indian 2 kamal haasan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X